Begin typing your search above and press return to search.

చైతూ.. అనుపమ మాయలో పడేది ఎక్కడంటే..

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:48 AM GMT
చైతూ.. అనుపమ మాయలో పడేది ఎక్కడంటే..
X
డైరెక్టరుకి క్లారిటీ ఉంటే.. స్క్రిప్టు పక్కాగా ఉంటే షూటింగ్ ఎంత వేగంగా సాగిపోతుందో ‘మజ్ను’ మూవీ జోరు చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘ప్రేమమ్’కు రీమేక్ అయినప్పటికీ.. స్క్రిప్టు విషయంలో నాలుగైదు నెలలు కష్టపడ్డాడు యువ దర్శకుడు చందూ మొండేటి. అంతా పక్కాగా ఓకే అన్నాక గత నెలలో షూటింగ్ మొదలుపెట్టించిన చందూ.. జెట్ స్పీడుతో సినిమాను లాగేస్తున్నాడు. సినిమాకు అత్యంత కీలకమైన నాగచైతన్య-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ నే ముందు మొదలుపెట్టిన చందూ.. నాన్ స్టాప్ ఫస్ట్ షెడ్యూల్ తో ఈ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేశాడు. క్లైమాక్స్ సీన్ మినహాయిస్తే శ్రుతి ఇక నటించాల్సిందేమీ లేదు.

కొంచెం గ్యాప్ తీసుకుని ఈ నెలాఖర్లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతోంది ‘మజ్ను’ యూనిట్. ఈ షెడ్యూల్లో హీరో ఫస్ట్ లవ్ ఎఫైర్ షూట్ చేయబోతున్నారు. మొన్నటి దాకా రఫ్ లుక్ లో దర్శనమిచ్చిన చైతూ.. ఇక నీట్ షేవింగుతో టీనేజర్లాగా మారబోతున్నాడు. చైతూ - అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో టీనేజ్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు రెండో షెడ్యూల్లో. ఈ షూటింగ్ అంతా రాజమండ్రి - పరిసరాల్లో తీయబోతున్నారు. మలయాళంలో కేరళ అందాల్ని ఎలివేట్ చేస్తూ ఈ లవ్ ట్రాక్ ను ఎంతో ఆహ్లాదంగా నడిపాడు డైరెక్టర్ అల్ఫాన్సో పుతెరిన్. తెలుగులో చందూ.. రాజమండ్రి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. కోన సీమ అందాల బ్యాగ్రౌండ్ లో లవ్ స్టోరీలో ఫీల్ తేవడానికి ట్రై చేసేట్లున్నాడు. దీని తర్వాత చివరి షెడ్యూల్లో హీరో థర్డ్ అండ్ ఫైనల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తారన్నమాట.