Begin typing your search above and press return to search.
అన్నయ్య సినిమాల రీమేక్.. వరుణ్ కి పెద్ద సవాల్!
By: Tupaki Desk | 23 April 2020 1:01 PM ISTలాక్ డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలు అందరూ వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను, సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. సోషల్ మీడియాలో అడిగిన కొన్ని ఇంటరెస్టింగ్ ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. అందులో.. 'చిరంజీవి గారు చేసిన సినిమాల్లో ఏదైనా సినిమాను వరుణ్ తేజ్ తో రీమేక్ చేయవలసి వస్తే ఏ సినిమా చేస్తారు?' అని అడిగిన ప్రశ్నకు.. నాగబాబు స్పందిస్తూ 'అన్నయ్య చేసిన సినిమాల్లో నాకు 'ఛాలెంజ్' అంటే చాలా ఇష్టం. సత్యానంద్ గారు మంచి స్క్రీన్ ప్లేను అందించారు.
వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా అయితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది' అన్నారు. 'అంతేగాక అన్నయ్య చేసిన సినిమాల్లో 'కొదమ సింహం' కూడా నాకు బాగా నచ్చుతుంది. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఆ సినిమాను రూపొందించారు. కౌబాయ్ గా అన్నయ్య యాక్టింగ్ ఇరగదీసారు. ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కు సెట్ అవుతుందని అన్పిస్తుంది. కానీ అన్నయ్య చేసిన సినిమాలను రీమేక్ చేసి మెప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. అది వరుణ్ కి పెద్ద సవాలే అవుతుంది' అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుణ్ బాక్సర్ గా ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..