Begin typing your search above and press return to search.

నాగ‌బాబు న్యూ లుక్ నెట్టింట సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   11 March 2022 9:30 AM GMT
నాగ‌బాబు న్యూ లుక్ నెట్టింట సంచ‌ల‌నం!
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు టాలీవుడ్ లో పెద్ద‌ బిజీ ఆర్టిస్ట్ కాదు. అప్పుడ‌ప్పుడు అతిధి పాత్ర‌లు..టీవీషోల‌తోనే బిజీగా ఉంటారు. కొన్నాళ్ల‌గా సినిమా నిర్మాణానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయ‌న చివ‌రి సారిగా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన `బంగార్రాజు` చిత్ర‌లో య‌మ‌ధ‌ర్మ రాజు పాత్ర‌లో క‌నిపించారు.

ఆ తర్వాత కొత్త సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు కూడా క‌నిపించలేదు. బుల్లి తెర హోస్ట్ ఈవెంట్లు కూడా బాగా త‌గ్గించారు. అయితే తాజాగా నాగ‌బాబు న్యూ లుక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది.

60 ఏళ్ల నాగ‌బాబు కొత్త గెట‌ప్ లో ఆక‌ట్టుకుంటున్నారు. న్యూ మేకోవ‌ర్ లో మెగా బ్ర‌ద‌ర్ 30 ఏళ్ల కుర్రాడిలా మారిపోయారు. నెరిసిన గ‌డ్డం..హ్యండిల్ బార్ మీసాలు..ముఖంలో ఫ్రెష్ నెస్ తో ఉత్సాహ‌మైన ఫోజు ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. వాటికి సంబంధించిన కెమెరా క్లోజ్ అఫ్ షాట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేసారు నాగ‌బాబు.

దీంతో నెటి జ‌నులు స‌హా మెగా అభిమానులు ఈ న్యూలుక్ రీజ‌న్ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ లుక్ ఏ సినిమా కోసం? అన్న‌ది నాగ‌బాబు రివీల్ చేస్తే గానీ తెలియ‌దు.

నాగ‌బాబు కొంత బ‌రువు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అలాగే మాంసాహారిగా ఉండే నాగ‌బాబు ఇప్పుడు పూర్తిగా శాఖాహారికిగా మారిపోయారు. మ‌రి నాగ‌బాబుని ఇంత అందంగా సిద్దం చేసింది ఎవ‌రంటే? అత‌ని మ్యాకప్ మేన్ నాగ శ్రీనికి ఈ సంద‌ర్బంగా క్రెడిట్ ఇచ్చారు.

``మీ ప్ర‌తిభ ఎప్ప‌టికీ ఊరుక‌నే పోదు. అందుకు త‌గిన ఫ‌లితం ఏదో ఒక రోజు ఉంటుంద‌ని ఆశించారు. అలాగే నాగ శ్రీను కుటుంబంతో క‌లిసి దిగిన మ‌రో ఫోటోను కూడా నాగ‌బాబు అభిమానుల‌కు షేర్ చేసారు.

త‌న‌యుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్ ఎదుగుద‌ల‌లో నాగ‌బాబు కీల‌క పాత్ర‌ధారి. వ‌రుణ్ ఎంపిక చేసుకునే స్ర్కిప్ట్ ల విష‌యంలో నాగ‌బాబు ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఇద్ద‌రు అనుకుంటేనే ఆ స్ర్కిప్ట్ ముందుకు క‌దులుతుంది. కుమారుడి కెరీర్ కి అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు..సూచ‌న‌లు నాగ‌బాబు ఇస్తుంటారు.

ఇద్ద‌రు ఫాద‌ర్..స‌న్ అనే బాండింగ్ క‌న్నా స్నేహితుల్లా మెలుగుతారు. మ‌రి అలాంటి స్నేహ‌పూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణంలో ఇద్ద‌రు క‌లిసి ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? అందులో భాగంగానే నాగ‌బాబు ఇలా న్యూ మేక‌వ‌ర్లో క‌నిపిస్తున్నారా? అన్న సందేహం త‌లెత్తుతుంది.