Begin typing your search above and press return to search.

దేవుడు.. నాస్తికుడు.. మధ్యలో నాగబాబు

By:  Tupaki Desk   |   13 July 2020 10:30 AM GMT
దేవుడు.. నాస్తికుడు.. మధ్యలో నాగబాబు
X
మెగా బ్రదర్ నాగబాబు కరోనా-లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తున్నారు. ఆయన సోదరుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కల్లోలం టైంలో పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉంటూ మౌనం వహిస్తుండగా.. నాగబాబు మాత్రం చెలరేగిపోతున్నాడు.

జనసేన ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి అరువు తెచ్చుకున్న హిందుత్వావాదంతో నాగబాబు చెలరేగిపోతున్నారన్న విమర్శ ఉంది. బీజేపీ బాటలో హిందూ అనుకూల వ్యాఖ్యలు ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా వస్తున్నాయి. అయితే పార్టీ పరంగా హిందుత్వావాదం వినిపిస్తున్న నాగబాబు మనసు మాత్రం నాస్తికుడనేలా ఆయన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

మొన్నటికి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను పట్టుకొని అసలైన దేశభక్తుడని నాగబాబు కొత్త అర్థం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినీ,రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఇక అది మరిపోకముందే.. చైనా మీద పడ్డారు నాగబాబు. మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులు, సెల్ ఫోన్లు, మొబైల్ యాప్స్ ను బహిష్కరిద్ధాం అంటూ నాగబాబు బీజేపీ నేతల వలే జాతీయతను తట్టిలేపారు. కశ్మీర్ లో హత్యకు గురైన హిందూ పండింట్ విషయంలో సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు.

ఇక ఇటీవల హిందువుల గురించి వ్యాఖ్యనిస్తూ దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానం గా చూసే ఒక పార్టీ పాలన లో ఉన్నాం’ అంటూ బీజేపీకి మద్దతుగా ట్వీట్ చేశారు నాగబాబు..

తాజాగా మరోసారి దేవుడి గురించి నాగబాబు ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేశారు. దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయాన్ని వర్ణిస్తూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ తో మొదలెట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ విశ్వం నడుస్తుందని.. అయితే దాన్ని నిరూపించడానికి అవకాశం లేదని.. తాను మాత్రం ఇలాంటి నమ్మకాలను నమ్మనంటూ నాస్తికుడిని అని అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేశారు.

ఇలా మెగా బ్రదర్ నాగబాబు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకెళుతున్నట్టు చూస్తే అర్థమవుతోంది. ఆయన హిందుత్వ వాదాన్ని తెరపైకి తెస్తున్నారని.. అదే సమయంలో పరమ బీజేపీ భక్తుడిని కాదంటూ నాస్తికుడననే అభిప్రాయాన్ని వ్యాపింపచేస్తున్నారని అర్తమవుతోంది..