Begin typing your search above and press return to search.
#నిహారిక పెళ్లి.. చిరంజీవిలా స్టెప్పులేశావ్ బ్రదర్
By: Tupaki Desk | 9 Dec 2020 11:10 AM ISTఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ రేతిరంతా నియాన్ కాంతుల జిగిబిగితో దుమారం రేపింది. రేతిరేళ కొణిదెల వారి వెడ్డింగ్ సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. అక్కడ మెగా హీరోలంతా సందడే సందడి. ఇక అతిథులతో కిటకిటలాడిన వెన్యూ సంగీత్ మెహందీ అంటూ కన్నులపండుగనే తలపించింది.
ఈ పెళ్లి నుంచి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో తాజా వీడియో సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. మెహెందీ వేళ పెళ్లికూతురు నిహారిక ఎంతో సంబరంగా డ్యాన్సులు చేస్తుంటే తన తో పాటు మెగా బ్రదర్ నాగబాబు స్టెప్పు కలిపిన తీరు నవ్వులు పూయించింది.
అన్నయ్య చిరంజీవి పాటకు స్టెప్పులేసేందుకు నాగబాబు పోటీపడ్డారు. నిహారికతో కలిసి వీణ స్టెప్పు వేసారు మరి. ఇక నాగబాబు బంధుమిత్రులు నాగుపాము నాట్యంతో ఎంతో ఫన్ క్రియేట్ చేశారు ఈవెంట్లో. నేటి(బుధవారం) సాయంత్రం కన్నుల పండుగగా నిహారిక-చైతన్య జంట వివాహం జరగనుంది. ఈ వేడుకకు సుమారు వందమంది అతిథులు హాజరుకానున్నారని సమాచారం.