Begin typing your search above and press return to search.

'ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కథ గురించి నాగబాబు

By:  Tupaki Desk   |   14 April 2020 1:20 PM IST
ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కథ గురించి నాగబాబు
X
రాజమౌళి ఏ సినిమా తీసినా కూడా కథ విషయంలో ముందే క్లారిటీ ఇస్తాడు. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కథ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్‌ ల చరిత్ర నేపథ్యంలో సాగుతుందని.. చరిత్రలో వీరు కలిసినట్లుగా ఆనవాళ్లు ఏమీ లేవు.. కాని వీరిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది తాను చూపించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దాంతో ఇద్దరు కలిసి స్వాతంత్య్రం కోసం ఎలా పోరాడారు.. ఇద్దరు ఎలాంటి పరిస్థితుల్లో కలిశారు అనేది జక్కన్న చూపిస్తాడని అనుకున్నారు.

తాజాగా రామరాజు వీడియో వచ్చిన తర్వాత అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. జక్కన్న చెప్పిన దాని ప్రకారం ఊహించుకున్న వారు ఇప్పుడు నోరు వెళ్లబెడుతున్నారు. చరణ్‌ ను అల్లూరి సీతారామరాజు అంటూ చెప్పిన రాజమౌళి పోలీస్‌ గా ఎందుకు చూపించబోతున్నాడు. అసలు కథలో పోలీస్‌ గా చరణ్‌ ఎందుకు కనిపిస్తాడు అనే చర్చ మొదలైంది. అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్‌ పాత్రలను పూర్తిగా విభిన్నంగా చరిత్రకు విరుద్దంగా రాజమౌళి చూపించబోతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఈ చిత్రం కథ విషయమై స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. కొమురం భీమ్‌ తెలంగాణలో అల్లూరి సీతారామరాజు ఆంధ్రాలో పేదల హక్కుల కోసం స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. చరిత్రలో వీరిద్దరు కలవలేదు. ఒకవేళ కలిసి యుద్దం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా అయ్యి ఉంటుంది. కథ ఎలా ఉన్నా కూడా రాజమౌళి ఈ సినిమాను హిట్‌ చేస్తాడనే నమ్మకం ఉందని నాగబాబు పేర్కొన్నాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రంను రాజమౌళి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమా చూడాలనుకుంటున్న వారు వచ్చే ఏడాది జనవరి 8 కోసం వెయిట్‌ చేస్తున్నారు.