Begin typing your search above and press return to search.

పెళ్లికి సిద్ధ‌మంటూ స‌డ‌న్ షాకిచ్చిన‌ యంగ్ హీరో

By:  Tupaki Desk   |   22 Feb 2022 9:30 AM GMT
పెళ్లికి సిద్ధ‌మంటూ స‌డ‌న్ షాకిచ్చిన‌ యంగ్ హీరో
X
యంగ్ హీరోలు ఈ మ‌ధ్య వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటి వార‌వుతున్నారు. కోవిడ్ కార‌ణంగా టాలీవుడ్ లో పెళ్లిళ్ల ప్ర‌క్రియ జోరుగా ఊపందుకుంది. ఇప్ప‌టికే యంగ్ హీరోలు చాలా వ‌ర‌కు కోవిడ్ సెకండ్ వేవ్ లోనే పెళ్లి చేసుకుని షాకిచ్చారు. రానా, నితిన్‌, నిఖిల్ వంటి హీరోలు పెళ్లి వార్త‌తో షాకిచ్చి ఓ ఇంటివారైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే బాట‌లో మ‌రో యంగ్ హీరో పెళ్లికి సిద్ధ‌మంటూ స‌డెన్ షాక్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. `సింధూర‌పువ్వు` సినిమాతో ఫేమ‌స్ ప్రొడ్యూస‌ర్‌గ ఆపేరు తెచ్చుకుని ఇండ‌స్ట్రీలో నిర్మాత కృష్ణారెడ్డి `సింధూర‌పువ్వు` కృష్ణారెడ్డిగా స్థిర‌ప‌డిపోయారు. ఆయ‌న త‌న‌యుడు నాగ అన్వేష్ త్వ‌ర‌లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త‌న మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం ఇటీవ‌ల హైద‌రాబాద్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో కుటుంబ స‌భ్యుల‌తో పాటు శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు.

వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటో ఒక‌టి నెట్టింట ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. గ‌త కొంత కాలంగా హీరో నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని కుటుంబ స‌భ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల స‌భ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. కావ్య తండ్రి ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ అప‌ర్ణ కంప‌నీ డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కాగా నాగ అన్వేష్ తండ్రి ప్ర‌ముఖ నిర్మాత సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి.

నాగ అన్వేష్ 2015లో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆయ‌న హీరోగా న‌టించిన తొలి చిత్రం `విన‌వ‌య్యా రామ‌య్యా`. ఈ మూవీ త‌రువాత రెండేళ్ల విరామం త‌రువాత `ఏంజెల్‌` మూవీలో న‌టించాడు. ఈ చిత్రాన్ని నాగ అన్వేష్ తండ్రి సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి స్వ‌యంగా నిర్మించారు.

హెబ్బా ప‌టేల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ మూవీ త‌రువాత నాగ అన్వేష్ మ‌రో సినిమా చేయ‌లేదు. `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` సినిమాతో బాల‌న‌టుడిగా నాగ అన్వేష్ కెరీర్ ప్రారంభించి ఆ త‌ర‌వాత హీరో అయ్యాడు. త్వ‌ర‌లో పెళ్లి కి రెడీ అవుతున్న నాగ అన్వేష్ వ‌చ్చే ఏడాది భారీ బ‌డ్జెట్ తో ఓ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి విరాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టుగా తెలిసింది.