Begin typing your search above and press return to search.

'చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్'గా మారిన నాగ్.. మరింత యవ్వనంగా!

By:  Tupaki Desk   |   24 Feb 2021 3:00 PM IST
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మారిన నాగ్.. మరింత యవ్వనంగా!
X
అక్కినేని నాగార్జున రోజురోజుకి మరింత యవ్వనంగా తయారవుతున్నాడు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపించే నాగ్.. ఆరుపదుల వయసు మీదపడినా నిరంతరం వ్యాయామం, వర్కౌట్స్ చేస్తూ సినిమాలకు అనుగుణంగా తనను మలుచుకుంటున్నాడు. నాగ్ ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ఆరాటపడే హీరోలలో ఒకరు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్నటువంటి సీనియర్ హీరోలలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో నాగ్ అని చెప్పాల్సిందే. అయితే త్వరలో నాగ్ భారీ యాక్షన్ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పిఎస్‌వి గరుడవేగ మూవీతో స్టైలిష్‌ మేకర్ అనిపించుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గరుడవేగతో ఒకసారిగా తనలోని మరో యాంగిల్ బయటికి తీసాడు సక్సెస్ అయ్యాడు. ఎన్నడూ లేనివిధంగా ఆ సినిమాలో హీరో రాజశేఖర్ ను కొత్తగా చూపించాడు.

ఇప్పుడు ప్రవీణ్ సినిమాలో పరిగెత్తడానికి నాగ్ వంతు వచ్చింది. నాగార్జునను ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపెందుకు స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడట ప్రవీణ్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై ఇండస్ట్రీలో పలువార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే షూట్ ప్రారంభించి నాగ్, ప్రవీణ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇప్పటికే నాగార్జునతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసాడట ప్రవీణ్. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో హైలైట్ కాబోతుందట. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నాగ్ 45ఏళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆ పాత్రకోసం నాగ్ చాలా మేకోవర్ అయినట్లు సమాచారం. ఈ ఫస్ట్ యాక్షన్ షెడ్యూల్ తర్వాత.. ప్రవీణ్, నాగ్ ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ షూట్ చేయడానికి గోవాకు వెళతారని తెలుస్తుంది. ఇప్పటికే నాగ్ వైల్డ్ డాగ్ మూవీ కంప్లీట్ చేసాడు. చూడాలి మరి నాగ్ ప్రవీణ్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో!