Begin typing your search above and press return to search.

మళ్లీ యాక్టింగ్‌ పై దృష్టి పెట్టిన నాగ్ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   24 March 2021 11:30 PM GMT
మళ్లీ యాక్టింగ్‌ పై దృష్టి పెట్టిన నాగ్ డైరెక్టర్‌
X
అందాల రాక్షసి సినిమాలో ఒక హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన రాహుల్‌ రవీంద్రన్‌ ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. హీరోగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాహుల్‌ చేసిన సినిమాలు నిరాశ పర్చాయి. ఆయన నటుడిగా ఆశలు వదుకుని చిలసౌ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అక్కినేని వారి బ్యానర్‌ లో రూపొందిన చిలసౌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నాగార్జునతో సినిమా ను చేసే అవకాశం దక్కించుకున్నాడు. నాగ్ ను మన్మధుడు 2 అంటూ చూపించి అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చిన రాహుల్ త్వరలో గీతాఆర్ట్స్‌ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. కాని తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక మలయాళ సినిమా ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు ఈయన సిద్దం అయ్యాడు.

ఆ రీమేక్ లో రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా నటించబోతున్నాడు. ఒరిజినల్‌ వర్షన్ లో సురాజ్ వెంజరమూడు పోషించిన పాత్రను తెలుగు మరియు తమిళ రీమేక్‌ లో రాహుల్ రవీంద్రన్‌ పోషించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ ప్రారంభం అయ్యింది. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు మరియు తమిళంలో మంచి గుర్తింపు ఉన్న నటి ఐశ్వర్య రాజేష్‌ ను ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. దర్శకుడి కంటిన్యూ అవుతాడని భావిస్తూ ఉంటే మళ్లీ హీరోగా సినిమా చేసేందుకు రాహుల్‌ కమిట్‌ అవ్వడం కొందరికి ఆశ్చర్యంగా ఉంది. మరి ఈసారి అయినా నటుడిగా రాహుల్‌ సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.