Begin typing your search above and press return to search.

'వైల్డ్ డాగ్'లో నాగ్ వివాదాస్పద డైలాగ్.. నెటిజన్ల ఫైర్!!

By:  Tupaki Desk   |   13 March 2021 3:30 PM GMT
వైల్డ్ డాగ్లో నాగ్ వివాదాస్పద డైలాగ్.. నెటిజన్ల ఫైర్!!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో రానురాను డైలాగ్స్ విషయంలో హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలు అనేవి ప్రేక్షకుల పై, అభిమానుల పై విపరీతంగా ప్రభావం చూపిస్తాయి. అసలే ఫేవరేట్ హీరో అలా చేసాడని.. ఇలా చేసాడని.. ఆ హెయిర్ కట్, ఆ జీన్స్ ప్యాంటు, ఆ సిగరెట్ పట్టే స్టైల్ అంటూ కుర్రాళ్లు కూడా అనుకరిస్తూ వేషాలు వేస్తుంటారు. అలాగే ఫేవరేట్ హీరోయిన్ ఆ డ్రెస్ వేసిందని.. ఆ సారీ ఇలా కట్టిందని.. హెయిర్ కట్ అంటూ.. మోడరేన్ స్టైల్ అంటూ అమ్మాయిలు బాగా ప్రభావితం అవుతున్న రోజులివి. మరి ఇలాంటి పరిస్థితులలో తమ ఫేవరేట్ హీరో లేదా హీరోయిన్ నోట్లో నుండి ఎలాంటి బూతులు వినిపించినా ఇట్టే ఫాలో అయిపోతుంటారు ఫ్యాన్స్.

ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ ప్రభావం ఇంకా పోలేదు. అలాగని మరిన్ని సినిమాలు అదే ప్రభావం చూపించేలా తీయడం కూడా ఆపట్లేదు. ఫేవరేట్ హీరో మాస్ డైలాగ్ కొడితే అదే ఫాలో అవుతారు. అదే హీరో ఘోరమైన బూతులు మాట్లాడితే.. అందులోను బీప్ లేకుండా రిలీజ్ చేస్తే అది ఫ్యాన్స్ పై సినిమా చూసేవారిపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ట్రైలర్ విడుదలైంది. ఆ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగానే ఉంది. కానీ చివరలో నాగ్ చెప్పే డైలాగ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశం అయింది.

ఓ శత్రువును తుపాకీతో కాల్చే సందర్బంలో నాగ్.. తల్లి గురించి ఓ బూతు మాట్లాడటం జరిగింది. అది కూడా మేకర్స్ బీప్ లేకుండా వదిలారు. అసలే రోజులు బాలేవు అని భావిస్తుండగా.. మధ్యలో సినిమావాళ్లు సందేశాలు ఇవ్వాల్సింది పోయి ఇలాంటి బూతులు వాడితే ఎలా.. అంటూ ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సినిమాలో అయినా ఆ డైలాగ్ బీప్ చేస్తారేమో.. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ విడుదల కాబోతుంది.