Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు నాగ్‌ అశ్విన్‌ ప్రామిస్‌

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:30 PM GMT
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు నాగ్‌ అశ్విన్‌ ప్రామిస్‌
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా నేడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించిన ఖచ్చితంగా ఏదైనా అప్‌ డేట్‌ లేదా పోస్టర్‌ అయినా వస్తుందని అంతా ఆశించారు. కాని వైజయంతి మూవీస్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను సింపుల్‌ గా చెప్పేశారు. మన సూపర్‌ హీరో ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. సూపర్‌ హీరో అంటూ హింట్‌ ఇవ్వడంతో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీలో సూపర్‌ హీరోగా ప్రభాస్‌ కనిపించబోతున్నట్లుగా హింట్‌ ఇచ్చారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సందర్బంగా వచ్చే బర్త్‌ డేకు ఖచ్చితంగా మీకోసం ఏదైనా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంకా షూటింగ్‌ ప్రారంభించలేదు కనుక ఇప్పుడే ఏం స్టిల్‌ కాని అప్‌ డేట్‌ కాని ఇవ్వలేక పోయారు. వచ్చే ఏడాది సమ్మర్‌ నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అంటున్నారు. అప్పటి వరకు కాస్త అయిన షూటింగ్‌ జరుగుతుంది. లేదంటే కనీసం ఏదైనా అప్‌ డేట్‌ అయినా ఇచ్చే అవకాశం ఉంది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ సూపర్‌ హీరోగా చేయబోతున్న సినిమాకు సంబంధించిన లుక్‌ లేదా అప్‌ డేట్‌ రావాలంటే వచ్చే ఏడాది ఇదే రోజు వరకు వెయిట్‌ చేయాల్సిందే. కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా ఆది పురుష్‌ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదు కనుక ఎలాంటి అప్‌ డేట్‌ ఇవ్వలేదు. వచ్చే ఏడాది బర్త్‌ డే కు ఆదిపురుష్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ లేదా పోస్ట్‌ వచ్చే అవకాశం ఉంది.