Begin typing your search above and press return to search.
ప్రాజెక్ట్ K: అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
By: Tupaki Desk | 9 Feb 2023 10:17 AMయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో అడ్వాన్స్డ్ స్టొరీలైన్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుత కాలానికి ముందుగా భవిష్యత్తులో జరిగే కథగా దీనిని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ మూవీ కోసం ఇండియాని సరికొత్త లుక్ లో, ఇప్పటి వరకు ఎవరూ చూడని ఆలోచనలలో చూపించబోతున్నాడు.
ఇక మూడో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇక సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నట్లు గతంలో ప్రాజెక్ట్ కె నుంచి వచ్చిన లుక్స్ బట్టి తెలుస్తుంది. మహాభారతంలో క్యారెక్టర్స్ ని ఫ్యూచర్ స్టొరీకి ఆపాదించుకొని ఈ కథని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ 'స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకునే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఉపయోగించే కార్లని కూడా కొత్తగానే చూపించబోతున్నట్లు గతంలో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రతి అంశాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ప్రాజెక్ట్ కె లో చూపిస్తున్న నేపధ్యంలో కచ్చితంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని చూసి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్. అందుకే సినిమా నుంచి ఎలాంటి లీక్డ్ వీడియోలు, ఫోటోలు బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది అనే విషయాన్ని నాగ అశ్విన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఇన్స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో వెహికల్స్ కి వాడే స్పీడో మీటర్ ఫోటో షేర్ చేసి ప్రాజెక్ట్ కె అప్డేట్ అంటూ ఇచ్చారు. ఇక ఆ స్పీడో మీటర్ మీద రెవ అనే పేరు ఉంది.
దీనికి సినిమాలో కచ్చితంగా ఇంటరెస్టింగ్ కనెక్షన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పోస్ట్ క్రింద ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఇవ్వండి అంటూ నాగ అశ్విన్ కి ట్యాగ్ చేసి మరీ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.