Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'సిల్వర్ జూబ్లీ' మూవీగా నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్..!
By: Tupaki Desk | 2 July 2021 11:03 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి రూపొందనున్న సంగతి తెలిసిందే. 'రాధే శ్యామ్' సెట్స్ పై ఉన్నప్పుడే #Prabhas21 పేరుతో ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అశ్వినీ దత్ సన్నాహాలు చేసుకున్నారు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లేట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'సలార్' 'ఆదిపురుష్' అనే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. దీంతో నాగ్ అశ్విన్ నెంబర్ చేంజ్ అయింది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిపోతే.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సినిమాటోగ్రాఫర్ డానీ శాంచెజ్-లోపెజ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.
ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని స్టార్ క్యాస్టింగ్ తో అత్యున్నత టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించాలని మేకర్స్ నిర్ణయుంచుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారు. దీనికి మిక్కీ జె.మేయర్ సంగీతం.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారని చిత్ర బృందం ప్రకటించింది. డానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రిపరేషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అర్రి కెమెరా ఎక్విప్మెంట్ ఆఫీస్ కు వెళ్లిన డానీ.. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ '#Prabhas25' అని ట్యాగ్ పెట్టాడు. దీంతో పాన్ ఇండియా వరల్డ్ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్ లో మైలురాయి సిల్వర్ జూబ్లీ సినిమాగా రాబోతోందని తెలుస్తోంది. అయితే శాంచెజ్-లోపెజ్ ఆ తర్వాత ఆ పోస్ట్ ని డిలీట్ చేసి #PRABHASDEEPIKAMITABH అనే ట్యాగ్ జోడించారు.
సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం కేటాయించాల్సి వస్తోందని.. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ డానీ పోస్ట్ తో ఇదే నిజమేనని సంకేతాలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే కనుక నిజమైతే నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఏ ఇద్దరు దర్శకులకు అవకాశం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సస్టార్ట్ చేసినా ఇది ప్రభాస్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ ఏ విషయంలో రాజీ పడకుండా ప్రీ ప్రొడక్షన్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.