Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ్యం సీక్వెల్ ఉండదు

By:  Tupaki Desk   |   15 May 2018 1:30 AM GMT
సుబ్రహ్మణ్యం సీక్వెల్ ఉండదు
X
మెగాస్టార్ తోనే చేసే అవకాశాల గురించి అశ్వినిదత్ చెప్పినా అది అప్పటికప్పుడు అన్నట్టు ఉంది కాని కార్యాచరణలోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఇకపోతే నాగ అశ్విన్ ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం సీక్వెల్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వాటికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చేసాడు ఈ యూత్ డైరెక్టర్. అసలు తన మనసులో ఎవడే సుబ్రహ్మణ్యం సీక్వెల్ ఆలోచనే లేదని ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీసామో అది అందులో స్పష్టంగా చెప్పేసానని కొత్తగా చూపడానికి ఏమి లేదని క్లారిటీ ఇచ్చేసాడు.

మహానటి కన్నా ముందే నాగ అశ్విన్ టాలెంట్ ని పరిచయం చేసింది ఎవడే సుబ్రహ్మణ్యం మూవీనే. దాంతోనే నానికి మేజర్ బ్రేక్ వచ్చింది. అందులో రిషిగా నటించిన విజయ్ దేవరకొండ ఆ పాత్ర ద్వారానే అర్జున్ రెడ్డి ఆఫర్ దక్కించుకోగలిగాడు.పెళ్లి చూపులు హీరొయిన్ రీతూ వర్మను కూడా అందులో చూడొచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో పాటు తెలుగు సినిమా జానర్ కు కొత్తగా అనిపించే కాన్సెప్ట్ తో నాగ అశ్విన్ చేసిన ఆ ప్రయత్నం కమర్షియల్ గా కూడా మంచి ఫలితం ఇచ్చింది. దీనితో పాటు ఒకే రోజు విడుదలైన నాని జెండాపై కపిరాజుని ఓవర్ టేక్ చేసి మరీ ఘన విజయాన్ని సాధించింది. సో దీనికి సీక్వెల్ ఉండదు అని నాగ అశ్విన్ చెప్పాడు కాబట్టి ఇక చర్చ అనవసరం. కాకపోతే నానితోనే ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని లైన్ డెవలప్ చేసే పనిలో ఉన్నాను అని చెప్పిన అశ్విన్ అది దేని గురించి అనే క్లూ అయితే ఇవ్వలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సీక్వెల్ కాకపోయినా మొత్తానికి ఆ కాంబోలో మూవీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్న మాట