Begin typing your search above and press return to search.

నాని సినిమాకు సీక్వెల్?

By:  Tupaki Desk   |   11 May 2018 6:27 AM GMT
నాని సినిమాకు సీక్వెల్?
X
హీరో ఎవ్వరినైనా మర్చిపోతాడేమో గాని డిజాస్టర్స్ లో ఉన్నప్పుడు హిట్టిచ్చినా దర్శకుడిని మాత్రం మరచిపోలేడు. నాని కూడా అదే తరహాలో నాగ్ అశ్విన్ ను మర్చిపోలేడు. అప్పటివరకు వరుస ప్లాపులతో ఉన్న నానికి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది నాగ్ అశ్విన్. ఆ ఆ సినిమాలతో నాని స్టార్ డమ్ ఒక సేఫ్ జోన్ లోకి వచ్చింది. సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే హిట్ అయ్యింది.

ఇక ఆ తరువాత నాని వరుస డబుల్ హ్యాట్రిక్స్ అందుకున్నాడు అది అందరికి తెలిసిందే. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఒకే ఒక్క సినిమాతో వచ్చాడు. సావిత్రి బయోపిక్ ని మహానటిగా తెరపై చూపించి మంచి ప్రశంసలను అందుకున్నాడు. సున్నితమైన అంశాన్ని ఓ వైపు ప్రేమ మరో వైపు బాధ తో ప్రతి అభిమాని ఫీల్ అయ్యేలా చేశాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి కథను డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఓ టాక్ ప్రకారం అయితే మళ్లీ స్వప్న క్రియేషన్స్ లోనే ఎవడే సుబ్రమణ్యంకు సీక్వెల్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నానితోనే మళ్లీ ఆ కథను పొడిగిస్తారట. నేటి తరానికి అర్ధమేయ్యేలా ఆత్యాద్మికతను స్టైలిష్ గా చూపించిన నాగ్ అశ్విన్ మరో మంచి అంశంతో రావచ్చని తెలుస్తోంది. ఇకపోతే నాని కూడా ఇటీవల కృష్ణార్జున యుద్ధం సినిమాతో నిరాశపరిచాడు. అంతకుముందు MCA కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ టైమ్ లో నాగ్ అశ్విన్ నానిని మళ్లీ రీఛార్జ్ చేస్తాడో లేదో చూడాలి.