Begin typing your search above and press return to search.

ఈ డిజిటల్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ఏంటో?

By:  Tupaki Desk   |   13 Feb 2018 6:17 AM GMT
ఈ డిజిటల్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ఏంటో?
X
ప్రస్తుతం యంగ్ హీరోల హవా సూపర్బ్ గా నడుస్తోంది. వీరిలో నాని రేంజ్ చాలా ఎక్కువ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. అలాగే విజయ్ దేవరకొండకు కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఒకట్రెండు సినిమాలతోనే యూత్ లో మాంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించడం అంటే.. నిజంగా క్రేజీ విషయమే. సావిత్రి జీవితకథగా తెరకెక్కుతున్న మహానటిలో ఎన్టీఆర్ గా నాని.. ఏఎన్నార్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారనే సంగతి ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఉండగా.. ఇప్పుడీ సినిమాలో డిజిటల్ వెర్షన్ లో ఎన్టీఆర్..ఏఎన్నార్ లను దింపుతున్నారనే టాక్ మరీ విచిత్రంగా ఉంది. మాయాబజార్ లోని ఓ పాటను రీసెంట్ గా చిత్రీకరించారట. అందులే భాగంగా ఒరిజినల్ మూవీలో నటించిన కొన్ని సన్నివేశాల్లోని ఎన్టీఆర్.. ఏఎన్నార్ లను డిజిటల్ మిక్సింగ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఒక సీన్లో అసలు దిగ్గజాలను చూపి.. మరో సీన్లో కుర్ర హీరోలను అవే పాత్రలో చూపించడం కరెక్టే కాదేమో అనే భావన చాలామందిలో కలుగుతోంది. అలా చేస్తే ప్రేక్షకులు ఆయా కేరక్టర్స్ కు కనెక్ట్ కాగలరా.. తేడా ఏమీ కొట్టదా అనేది పలువురి డౌట్. మేకర్స్ కూడా ఈ విషయంలో బాగానే సమాలోచనలు జరిపారని అంటున్నారు. మరి ఈ టాక్ లో వాస్తవం ఎంత అనే విషయం అయితే ఇంకా తెలియలేదు కానీ.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడని అనిపించక మానదు.