Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్ కోసం కిల్లర్ అప్డేట్ రెడీ చేస్తున్న నాగ్ అశ్విన్...!

By:  Tupaki Desk   |   7 Oct 2020 4:20 PM IST
డార్లింగ్ ఫ్యాన్స్ కోసం కిల్లర్ అప్డేట్ రెడీ చేస్తున్న నాగ్ అశ్విన్...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే హీరోయిన్ గా నటించనుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ మూవీ కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా వర్క్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే ఉండటంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని అడిగారు. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్ ప్రభాస్ పుట్టినరోజు నాడు ఎలాంటి ఉండదని చెప్పాడు.

నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. 'బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ ఉండదు. కరోనా వల్ల సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికే చాలా టైం ఉంది. అందుకే ఇప్పుడు ఏమీ రిలీవ్ చేయలేము. కానీ అతి త్వరలో ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందు ఒక కిల్లర్ అప్డేట్ ను మాత్రం ఉంటుంది'' అని పేర్కొన్నాడు. ప్రభాస్ పుట్టినరోజు నాడు ఏ అప్డేట్ లేదని బాధ పడినా.. అంతకంటే ముందే కిల్లర్ అప్డేట్ రానుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి డైరెక్టర్ చెప్పిన ఆ కిల్లర్ అప్డేట్ ఏంటో చూడాలి. ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న మిగతా రెండు చిత్రాలకు సంబంధించి ఏదొక అప్డేట్ రావడం ఖాయమని ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. 'రాధే శ్యామ్' సినిమా నుంచి టీజర్.. అలానే 'ఆదిపురుష్' నుంచి ఓ పోస్టర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.