Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ ఎవరికి ఓటు వేస్తాడు...?

By:  Tupaki Desk   |   1 Aug 2020 5:10 AM GMT
ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ ఎవరికి ఓటు వేస్తాడు...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటించనుంది. దీపికా రాకతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనికి తగ్గట్టే నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని.. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభాస్ 21కి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' మేకర్స్ సంగీత దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వకుండా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితి తన ప్రాజెక్ట్ విషయంలో రాకూడదని ఇప్పటి నుంచే మ్యూజిక్ డైరెక్టర్ వేటలో పడ్డారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నాడట. ఇండియాలో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా వెలుగొందుతున్న రెహమాన్ ఈ సినిమాకి వర్క్ చేస్తే మరింత క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. ఇదే క్రమంలో ఎమ్.ఎమ్. కీరవాణిని కూడా మరో ఆప్షన్ గా పెట్టుకున్నారట. ''బాహుబలి'' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణిని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారట. సాంగ్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఇద్దరూ ఇద్దరే. ఒకరు వెస్ట్రన్ స్టైల్ లో మ్యూజిక్ ఇస్తే మరొకరు క్లాసికల్ మ్యూజిక్ ఇవ్వగలరు. కాకపోతే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందే ప్రాజెక్ట్ కావడంతో ఏఆర్ రెహమాన్ వైపే మేకర్స్ మొగ్గుచూపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి వీరిలో ఎవరిని ప్రభాస్ 21 కోసం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాని పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.