Begin typing your search above and press return to search.
ప్రభాస్.. రానా కలయికపై దర్శకుడి క్లారిటీ
By: Tupaki Desk | 18 May 2020 11:45 AM ISTబాహుబలి సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించగా రానా విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్ రానా లు హోరాహోరీ తలపడి వావ్ అనిపించారు. మరో సారి వీరిద్దరి కాంబోలో సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ ను రానా ఢీ కొట్టబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇదే సమయంలో సినిమాలో రానా నటించే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. కొన్ని పనులకు ఇప్పుడు టైం కుదరడం లేదు. కానీ స్క్రిప్ట్ వర్క్ కు మాత్రం కావాల్సినంత సమయం లభించింది అన్నాడు.
కాస్టింగ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత సినిమా కు సంభందించిన నటి నటుల ఎంపిక ఉంటుందని చెప్పాడు. హీరోయిన్ ఫిక్స్.. విలన్ రానా.. కీలక పాత్రలో ఆ నటుడు.. ఈ నటి అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు కాస్త అయినా కుదుట పడితే కానీ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నాడు. 2022 లో సినిమా వచ్చే అవకాశం ఉందని అన్నాడు.