Begin typing your search above and press return to search.

బన్నీ తల్లిగా పవన్ అత్త

By:  Tupaki Desk   |   30 April 2018 10:14 AM IST
బన్నీ తల్లిగా పవన్ అత్త
X
అత్తారింటికి దారేది చిత్రంలో కథకు మాత్రమే కాదు.. సినిమాకు కూడా అత్యంత కీలకమైన పాత్రలో నటించింది నదియా. పవర్ స్టార్ కు అత్తగా నటించిన పాత్ర.. ఆమె కెరీర్ ను మలుపు తిప్పేసింది. అంతకు ముందు కూడా ఇలాంటి కీలక పాత్రలు నటించినా.. అత్తారింటికి దారేది చిత్రం ఆమెకు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.

అప్పుడు పవర్ స్టార్ కు అత్తగా నటించిన మెప్పించిన నదియా.. ఇప్పుడు స్టైలిష్ స్టార్ కు తల్లిగా మారిపోయింది. ఈ వారంలో విడుదల కానున్న అల్లు అర్జున్ ఫిలిం నా పేరు సూర్యలో బన్నీకి తల్లిగా నటించింది ఈ సీనియర్ నటి. కోపోద్రిక్తుడైన ఆర్మీ పర్సన్ రోల్ లో బన్నీ నటించగా.. అతడిని శాంతపరిచేందుకు ప్రయత్నించే పాత్రలో నదియా నటించింది. ఆమె కెరీర్ లో ఇది కూడా మరో మైలు రాయిగా నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనేక మంది పేరొందిన యాక్టర్స్ ఉన్నా.. నదియా పాత్ర ప్రత్యేకంగా ఉంటుందట.

శరత్ కుమార్.. అర్జున్.. నాజర్.. బొమన్ ఇరానీ వంటి వారితో పాటు.. అల్లు అర్జున్ కు గాడ్ ఫాదర్ పాత్రలో రావు రమేష్ కనిపించనున్నాడు. హీరోయిన్ అను ఇమాన్యుయేల్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదని.. ఆమెకు కూడా చెప్పుకోదగ్గ రోల్ ఉంటుందని తెలుస్తోంది. రైటర్ నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ.. ప్రతీ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడట.