Begin typing your search above and press return to search.

చంపేస్తానన్నా పోర్న్ వదలనంటున్న పాకిస్థానీ

By:  Tupaki Desk   |   31 July 2016 7:30 AM
చంపేస్తానన్నా పోర్న్ వదలనంటున్న పాకిస్థానీ
X
కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా స్వేచ్ఛగా తన బతుకు తాను బతకబోయి ప్రాణాలే కోల్పోయింది పాకిస్థానీ మోడల్ కందీల్ బలోచ్. ఆ విషాదాంతం ఇంకా జనాల మనసుల నుంచి ఇంకా చెదిరిపోలేదు. పాకిస్థాన్‌లో అమ్మాయిలు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఏమవుతుందో చెప్పడానికి కందీల్ ఉదంతమే నిదర్శనం. కొంచెం సెక్సీగా కనిపిస్తూ.. రెచ్చగొట్టే వీడియోలు పెట్టినందుకే కందీల్‌‌ కు అలాంటి దుస్థితి పట్టింది. ఇక ఓ పాకిస్థానీ ముస్లిం అమ్మాయి పోర్న్ సినిమాల్లో నటించి.. మళ్లీ పాకిస్థాన్ లో అడుగుపెడితే ఇంకేమైనా ఉందా? ఆమె ప్రాణాలు తోడేయకుండా వదులుతారా..? ఐతే తనను ఎవరెంత బెదిరించినా.. పోర్న్ ఇండస్ట్రీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది నదియా అలీ.

పోర్న్ సినిమాల ద్వారా పేరు తెచ్చుకుని.. పాకిస్థాన్ లో ప్రాణ భయం ఉందని అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది నదియా. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. కాకపోతే ఎంత అభిమానం సంపాదించినా స్వదేశంలో అడుగుపెట్టలేని.. కుటుంబ సభ్యుల్ని కలుసుకోలేని దుస్థితి ఆమెది. నదియాను చంపేయడానికి మతఛాందసవాదులు సిద్ధంగా ఉన్నారు. ఆమె పాక్ లో అడుగుపెట్టడం ఆలస్యం.. ఆమె ప్రాణాలు పోవడం ఖాయం. ఇప్పటికే ఆమెకు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయినా తాను పోర్న్ సినిమాల్ని వదిలే ప్రసక్తే లేదంటోంది నదియా.

‘‘నేనో ముస్లింని. నాకు కష్టాలు ఎక్కువ. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లోనే అడల్ట్ సీన్లలో నటించే నాకు మిలియన్లలో ఫాలోయర్స్ ఉన్నారు. నేను ఎంచుకున్న వృత్తి వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కానీ తర్వాత నన్ను వాళ్లు అర్థం చేసుకున్నారు. ఓ కూతురిగా నేను చేసే పనిని ఏ తల్లిదండ్రులూ అంగీకరించరని.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇందులోకి రావాల్సి వచ్చింది. కానీ ఈ జీవితం నుంచి బయటికి మాత్రం రాను. ఎన్ని బెదిరింపులు వచ్చినా పోర్న్ వదులుకోను. నన్ను చంపేస్తానన్నా నా నిర్ణయం మారదు’’ అని నదియా తేల్చి చెప్పింది.