Begin typing your search above and press return to search.

పాటలకు ఐ లవ్ యూ అనొచ్చు

By:  Tupaki Desk   |   8 Jun 2018 4:24 PM GMT
పాటలకు ఐ లవ్ యూ అనొచ్చు
X
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లక్ ఏమిటో గాని వచ్చినట్టే అనిపించి మళ్లీ రివర్స్ అవుతోంది. సినిమాకు అంచనాలు పెరిగే అవకాశం వస్తున్నప్పటికీ ఈ హీరో ఎక్కువగా డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. గత కొన్నాళ్ళుగా మెగా ఫ్యామిలీ యువ హీరోలు వరుస హిట్స్ తో వెళుతుంటే సాయి మాత్రం ఫెయిల్స్ తో సతమతమవుతున్నాడు.

ఏ సినిమా ప్లాప్ అయినా కూడా సాయికి సంగీత దర్శకులు మాత్రం హ్యాండ్ ఇవ్వడం లేదు. చాలా వరకు ఈ హీరో సినిమాల్లో సంగీతం మంచి ఆదరణను ఆందుకుంటోంది. ఇక ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తేజ్ ఐ లవ్ యూ సినిమా పాటలు కూడా ఆ విధంగానే అక్కట్టుకునేలా ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన నచ్చుతుందే అనే సాంగ్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.

అలాగే సినిమాపై కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. కరుణాకరన్ ప్రతి సినిమాలో సాంగ్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటాడు. ఇక ఈ పాటను వింటుంటే ఆయన మార్క్ కనిపిస్తోంది. గోపి సుందర్ కూడా లవ్ సాంగ్స్ ని అందించడంలో మంచి టెక్నీషియన్. ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రేపు ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు.