Begin typing your search above and press return to search.
'అంధాధున్' రీమేక్ ఛాలెంజింగ్ అంటున్న నభా
By: Tupaki Desk | 6 April 2021 7:00 PM ISTఅందానికి అందం ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ నభా నటేష్ ప్రత్యేకత. ఈ భామ కన్నడ రంగం నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టి ఇక్కడ వరుసగా క్రేజీ అవకాశాలు అందుకుంటోంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయ్యాక నభాకి ఎదురే లేకుండా పోయింది.
ఇటీవల సోషల్ మీడియాల్లోనూ ఈ భామ చాలా స్పీడ్ గా ఉంది. తాజాగా రెడ్ అనే లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీపై నభా రెడ్ హాట్ తళుకుబెళుకులు హాట్ టాపిక్ గా మారాయి. నిశ్శబ్దంగా సినీ పరిశ్రమలోని అగ్రస్థానాలకు చేరుకున్న నభా త్వరలోనే అంధాధున్ తెలుగు రీమేక్ లో రాధికా ఆప్టే పాత్రను తిరిగి పోషించనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి మొదటిసారి నభా మీడియాతో ఓపెనైంది. ఇది తన కెరీర్ లో తొలి రీమేక్ అని తెలిపిన నభా.. రీమేక్ మూవీలో తనకు ఆఫర్ చేసిన పాత్రలో నటించడం ఛాలెంజింగ్ అని కూడా అంది. ఒకటికి రెండు సార్లు చూశాకే ఈ పాత్రకు అంగీకరించానని.. ఒక మంచి చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందిన వెల్లడించింది. ఇప్పటికే ఒకరు చేసేసిన పాత్రలో చేసేప్పుడు ఆడియెన్ రిఫరెన్స్ తీసుకుంటారు. అందుకే దీనిని ఛాలెంజింగ్ గా భావిస్తున్నానని వెల్లడించారు. అంధాధున్ తెలుగు రీమేక లో నితిన్ కథానాయకుడు. తమన్నా మరో కథానాయిక. మేర్లపాకా గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సరసన నభా కెరీర్ ప్రారంభమైంది. తొలి సినిమాతోనే నభా లోని మాసిజం అభిమానులకు కనెక్టయ్యింది. దమ్ము కొట్టడం గుర్రపు స్వారీ వంటి విద్యలతో నభా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత తెలుగులో సుధీర్ బాబు సరసన డెబ్యూ నాయికగా రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నభా నటనకు అభిమానులు ఫిదా అయిపోయి మరో ఇలియానా అంటూ పొగిడేశారు.