Begin typing your search above and press return to search.

ఫోటోషూట్ల‌తో ఉతికి ఆరేస్తోంది!

By:  Tupaki Desk   |   6 Feb 2019 4:32 PM GMT
ఫోటోషూట్ల‌తో ఉతికి ఆరేస్తోంది!
X
అల్ల‌రి వేషాల కొంటె పిల్ల‌గా కుర్ర‌కారుకు వ‌లేసింది న‌భా న‌టేష్‌. సుధీర్ బాబు స‌ర‌స‌న `న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంలో న‌టించింది. ఆ సినిమాలో అల్ల‌రి అమ్మాయిగా న‌టించి బోయ్స్ మ‌న‌సు దోచింది. న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో మెప్పించింది. జెనీలియా త‌ర్వాత మ‌ళ్లీ ఆ త‌ర‌హాలో అల్ల‌రి హాసినిలా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డం న‌భాకి క‌లిసొచ్చింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న అవ‌కాశం.. ఆ త‌ర్వాత‌ ర‌విబాబు అదుగో చిత్రంలోనూ న‌భా న‌టేష్ న‌టించిన సంగతి తెలిసిందే.

న‌భా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2015లో వ‌జ్ర‌కాయ అనే క‌న్న‌డ చిత్రంతో సినీరంగ ప్ర‌వేశం చేసిన న‌భా న‌టేష్ ఆ త‌ర్వాత లీ, సాహెబా అనే క‌న్న‌డ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పెద్ద స్థాయికి ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఆ క్ర‌మంలోనే స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రానికి ఎంపిక చేయ‌డంతో ఈ అమ్మ‌డి ఆనందానికి అవ‌ధులే లేకుండా పోయాయ్. ఎన‌ర్జిటిక్ రామ్ స‌ర‌స‌న ఛాన్స్ అంటే అంతే ఎన‌ర్జిటిక్ గా ట్రాన్స్ ఫామ్ అయిపోవాల‌ని భావించిందో ఏమో .. న‌భా వ‌రుస పెట్టి ఫోటోషూట్ల‌తో ఉతికి ఆరేస్తోంది.

అందుకోసం టాలీవుడ్ లో పీఆర్ ని నియ‌మించుకుంది. వీళ్లంతా వ‌ద్ద‌న్నా.. కాద‌న్నా న‌భా ఫోటోషూట్ల‌ను వైర‌ల్ గా ప్ర‌మోట్ చేసేస్తున్నారు. ఇక ఇత‌ర భామ‌ల‌తో పోలిస్తే ఈ భామ‌లో ప‌ట్టు విడుపు క‌నిపిస్తోంద‌న్న పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే ప‌లువురి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల చూపు న‌భాపై ప‌డింద‌ని తెలుస్తోంది. జోరుగా సంత‌కాలు చేస్తే, ద‌ర్జాగా జీవించేందుకు స‌రిప‌డా సంపాదించుకోవ‌డ‌మెలానో ఈ చిన్నదానికి బాగా తెలుస‌ని అర్థ‌మ‌వుతోంది క‌దూ?