Begin typing your search above and press return to search.

రొమాన్స్ కు ఇస్మార్ట్ గా జిందాబాద్ జిందాబాద్

By:  Tupaki Desk   |   14 Jun 2019 7:48 AM GMT
రొమాన్స్ కు ఇస్మార్ట్ గా జిందాబాద్ జిందాబాద్
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి ఫామ్ లో లేకపోయినా రామ్ ను మొదటిసారిగా డైరెక్ట్ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇక రామ్ మేకోవర్.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఈమధ్యే ఈ సినిమానుండి దిమాక్ ఖరాబ్ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ మంచి ఊపున్న ట్యూన్ తో రావడంతో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమానుండి తాజాగా సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.

జూన్ 14 వ తేదీ సాయంత్రం 5 గంటలకు 'జిందాబాద్ జిందాబాద్' అనే పాటను విడుదల చేస్తున్నామని 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్ తన భుజంపైన నభా నటేష్ ను కూర్చోబెట్టుకుని బీచ్ లో నడుస్తూ ఉన్నాడు. అందాల భామ బరువు మోస్తూ.. సిగరెట్ కాలుస్తూ నడవడంలో శంకర్ మాస్ స్టైల్ మామూలుగా లేదు. నభ కూడా బికిని టైప్ లో ఒక వైట్ టాప్.. వైట్ నిక్కర్ ధరించి.. ఇస్మార్ట్ భామలా కనిపిస్తోంది. ఈ రొమాంటిక్ పాటను మాల్దీవ్స్ లోని అందమైన బీచ్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారట.

ఈ సినిమాలో నభ నటేష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 12 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.