Begin typing your search above and press return to search.

వేలాది మందికి ఫోన్‌ చేసి రమ్మన్న ఇస్మార్ట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:27 AM GMT
వేలాది మందికి ఫోన్‌ చేసి రమ్మన్న ఇస్మార్ట్‌ బ్యూటీ
X
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కంపెనీలు తమ ఉత్పత్తుల కు ప్రమోషన్‌ ను విభిన్నంగా చేస్తున్నాయి. సెలబ్రెటీలతో షాప్‌ ఓపెనింగ్స్‌ మరియు ప్రముఖ స్టార్స్‌ తో కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రమోషన్‌ వీడియోలు చేస్తూ భారీగా ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. ప్రమోషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త ప్రమోషన్‌ విధానాలు వస్తున్నాయి. ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ సరికొత్త ప్రమోషన్‌ కు తెర లేపింది.

ఇటీవల హైదరాబాద్‌ లో ఒక షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ లో నభా నటేష్‌ పాల్గొంది. ఆ షాపింగ్‌ మాల్‌ వారు నభా నటేష్‌ వాయిస్‌ ను రికార్డ్‌ చేసి జనాల్లోకి వదిలారు. వారి వద్ద ఉన్న వేలాది మొబైల్‌ ఫోన్స్‌ కు ఒకేసారి కాల్‌ చేసి నభా తో రికార్డ్‌ చేసిన వాయిస్‌ ను వినిపించారు. నేను ఇస్మార్ట్‌ శంకర్‌ హీరోయిన్‌ నభా నటేష్‌. నేడు ఫలానా షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కోసం మీ ప్రాంతానికి రాబోతున్నాను. మనమందరం ఆ షాపింగ్‌ మాల్‌ వద్ద కలుద్దాం రండీ అంటూ ఆ ఫోన్‌ కాల్‌ లిఫ్‌ చేయగానే నభా వాయిస్‌ వినిపిస్తుంది.

ఇలాంటి ప్రమోషన్స్‌ ఎన్నికల సమయం లో రాజకీయ నాయకులు.. కస్టమర్‌ కేర్‌ వారు మాత్రమే ఇప్పటి వరకు చేశారు. మొదటి సారి నభా నటేష్‌ వాయిస్‌ కొన్ని వేల మందికి వినిపించి షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కు ఆహ్వానించడం కాస్త వెరైటీ గా ఉంది. నభా నటేష్‌ వాయిస్‌ రాగానే కొందరు జనాలు ఆశ్చర్య పోగా.. మరి కొందరు ఆమె కాదేమో అంటూ కట్‌ చేశారట. ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్‌ కార్యక్రమాలు.. పద్దతులు ముందు ముందు మరెన్ని వస్తాయో కదా..!