Begin typing your search above and press return to search.

ఐస్మార్ట్ శంకర్ - దోచుకునే ఫిగర్

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:28 AM GMT
ఐస్మార్ట్ శంకర్ - దోచుకునే ఫిగర్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేవలం మూడు నెలల్లో పూర్తి చేసే టార్గెట్ తో బౌండెడ్ స్క్రిప్ట్ తో పూరి రంగంలోకి దిగాడు. మొదటి హీరొయిన్ గా ఇటీవలే నిధి అగర్వాల్ ని ప్రకటించిన టీం ఇప్పుడు రెండో హీరొయిన్ ని అఫీషియల్ చేసేసింది. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేలో సిరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ అల్లరి చేసి మెప్పించిన నభ నటేష్ ను రామ్ పక్కన మరో జోడిగా ఫిక్స్ చేసారు.

ఈ వార్త కొద్దిరోజుల క్రితమే ప్రచారం లో ఉన్నప్పటికీ ఇవాల్టితో అఫీషియల్ అయిపోయింది. ఇప్పటికె మొదలుపెట్టిన షూట్ తో నభ ఈ కొద్దిరోజుల్లో అడుగు పెట్టనున్నట్టు తెలిసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఐస్మార్ట్ శంకర్ కోసం రామ్ తన లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చుకున్నాడు. మాస్ అంశాలను మిస్ కాకుండా ఓ సరికొత్త పాయింట్ తో పూరి కథను రాసుకున్నట్టు వినికిడి. టెక్నాలజీకి హీరోయిజంని ముడిపెట్టే వినూత్నమైన పాయింట్ ఏదో ఇందులో ఉందట. మరి ఐస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్-నభ నటేష్ లతో రొమాన్స్ ఎలా కుదిరిందో తెలియాలంటే మూడు నెలలు వెయిట్ చేయాలి