Begin typing your search above and press return to search.

మతులు పోగొట్టే ఇస్మార్ట్ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   7 March 2022 11:30 AM GMT
మతులు పోగొట్టే ఇస్మార్ట్ అందాల ఆరబోత
X
నన్ను దోచుకుందువటే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభానటేష్‌. మొదటి సినిమా తోనే నటిగా మంచి పేరును దక్కించుకుంది. ప్రముఖుల నుండి ప్రశంసలను ఆ సినిమాకు దక్కించుకోవడంతో అనూహ్యంగా వరుస ఆఫర్లు వచ్చాయి.

ఆ సమయంలో ఈ అమ్మడికి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. తన అభిమాన దర్శకుడు పూరి అంటూ చెప్పే నభాకు అనూహ్యంగా ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడంతో పాటు సూపర్ హిట్‌ ను కూడా దక్కించుకుంది.

రామ్‌ హీరోగా నటించిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా లో మరో హీరోయిన్ ఉన్నా కూడా ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈమె మాస్‌ లాంగ్వేజ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇస్మార్ట్‌ బ్యూటీ టాలీవుడ్‌ లో సెటిల్‌ అయినట్లే అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చి ఈ అమ్మడికి కొత్త ఆఫర్లు రాకుండా చేసింది. మెల్ల మెల్లగా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.

ప్రస్తుతానికి తెలుగు తో పాటు కన్నడం మరియు మలయాళం సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో లకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. బ్లాక్‌ అండ్‌ ఫోటో ను నభా షేర్‌ చేసినా కుర్రాళ్ల కళ్లలో కలర్‌ పుల్‌ గా కనిపిస్తుంది.

అందాల నభా నటేష్ ను ఏ యాంగిల్‌ లో చూసినా కూడా ఆహా అన్నట్లుగా ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తూ.. ఇలా కింద కూర్చుని అందాల ఆరబోత చేస్తే ఒక అద్బుతమైన శిల్పంను ఇలా చెక్కినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు తాజా ఫోటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు అభిమానుల నుండి ఆధరణ దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం కు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను ఓకే చెప్పకుండా మెల్ల మెల్లగా సినిమా లను కమిట్‌ అవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. త్వరలోనే తన తెలుగు సినిమా ను ప్రకటిస్తానంటూ ఆ మద్య ఒక చిట్‌ చాట్ లో చెప్పుకొచ్చింది.