Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ఇస్మార్ట్‌ పోరి స్టైలిష్‌ హాట్ షో

By:  Tupaki Desk   |   19 Oct 2021 10:30 AM GMT
ఫొటోటాక్ : ఇస్మార్ట్‌ పోరి స్టైలిష్‌ హాట్ షో
X
తెలుగు ప్రేక్షకులకు నన్ను దోచుకుందువటే సినిమాతో మెప్పించిన నభా నటేష్ ఆ తర్వాత ఇస్మార్ట్‌ శంకర్ తో మరింత చేరువ అయ్యింది. రామ్‌ కు జోడీగా ఆ సినిమా లో నభా నటేష్‌ నటించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నభా నటేష్ ఈమద్య కాలంలో తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. కరోనా వల్ల కాస్త స్లో ఉన్నా కూడా టాలీవుడ్ లో ఈ అమ్మడు చాలా బిజీ అయ్యింది. తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది బ్యాక్‌ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి. పెద్ద హీరోల నుండి మొదలుకుని చిన్న హీరోల వరకు అందరితో కూడా ఈమె నటించేందుకు సిద్దంగా ఉంటుంది.

ఇక ఈమె రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తన హాట్ ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. కాని ఈసారి ఈమె షేర్‌ చేసిన ఫొటోలు మరింత ప్రత్యేకంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. స్టైలిష్‌ హాట్‌ షో అన్నట్లుగా మాంచి కాస్ట్యూమ్స్ లో ఆమెను అభిమానులు మరియు నెటిజన్స్ చూసి ఫిదా అవుతున్నారు. నభా నటేష్‌ అందంతో పాటు అభినయంలో టాప్‌ అని.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ గా ఆమె నిలవడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా నటేష్ మరో రెండు సినిమాలను కూడా చేస్తోంది. ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతర భాషల్లో కూడా ఈమె సినిమాలను చేస్తూ బిజీ అవుతోంది. తెలుగు లో ఈమె నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ గా ఇస్మార్ట్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత ఈ అమ్మడు వరుసగా టాలీవుడ్‌ లో సినిమాలకు పరిమితం అవుతోంది.