Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్‌ బ్యూటీ గెస్ట్‌ కు ఎక్కువ హీరోయిన్‌ కు తక్కువ

By:  Tupaki Desk   |   28 Jan 2020 5:45 AM GMT
ఇస్మార్ట్‌ బ్యూటీ గెస్ట్‌ కు ఎక్కువ హీరోయిన్‌ కు తక్కువ
X
సుధీర్‌ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే చిత్రం లో మంచి నటన తో మెప్పించిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఆ తర్వాత వెంటనే ఈమెకు ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో నటించే ఛాన్స్‌ దక్కింది. ఇస్మార్ట్‌ శంకర్‌ లో నభా నటన మరియు ఆమె బాడీ లాంగ్వేజ్‌ కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న నభా నటేష్‌ ఇండస్ట్రీ లో మంచి స్థాయి కి వెళ్లడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం తర్వాత ఈ అమ్మడికి పలు ఆఫర్లు వచ్చాయి. కాని పెద్ద హీరో అనే ఉద్దేశ్యం తో రవితేజ చిత్రం అయిన డిస్కోరాజా చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిస్కోరాజాతో నభా క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం అనుకున్నారు. ఇటీవల విడుదలైన డిస్కోరాజా చిత్రం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. గెస్ట్‌ రోల్‌ చేసి హీరోయిన్‌ గా ప్రచారం చేసుకుంది ఏంటీ అంటూ కొందరు నెటిజన్స్‌ నభా నటేష్‌ పై కామెంట్స్‌ చేస్తున్నారు.

డిస్కో రాజా చిత్రంలో నభా నటేష్‌ పాత్ర గెస్ట్‌ రోల్‌ కు ఎక్కువ ఉంది.. హీరోయిన్‌ కు తక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ పాత్రను ఏమనాలో మీరే చెప్పండి అంటూ మరికొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఇస్మార్ట్‌ శంకర్‌ తో వచ్చిన విజయాన్ని నభా నటేష్‌ ఏమాత్రం వినియోగించుకోలేక పోయింది. తెలివి తక్కువ నిర్ణయం తో మంచి ఛాన్స్‌ ను మిస్‌ చేసుకుంది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.