Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇస్మార్ట్ గా దిమాక్ ఖరాబ్ చేస్తోందే!

By:  Tupaki Desk   |   12 April 2019 10:58 AM GMT
ఫోటో స్టొరీ: ఇస్మార్ట్ గా దిమాక్ ఖరాబ్ చేస్తోందే!
X
ఎనర్జెటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'సవ్యసాచి' ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే గ్లామర్ డిపార్ట్ మెంట్ ను ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకునే పూరి జగన్నాధ్ ఈ సినిమాలో హాట్ బ్యూటీ నభా నటేష్ ను సెకండ్ హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ 'దిమాక్ ఖరాబ్' సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఈ పాటలో రామ్ కు తోడుగా ఇద్దరూ హీరోయిన్లు ఆడిపాడుతున్నారట. ఇప్పటికే ఈ పాటలో నిధి అగర్వాల్ వేసే స్టెప్పులకు సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చాయి. తాజాగా నభ నటేష్ స్టిల్స్ కూడా వచ్చాయి. నభ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ షేర్ చేస్తూ "ఇస్మార్ట్ శంకర్ సెట్స్ నుండి 'దిమాక్ ఖరాబ్' సాంగ్ స్నీక్ పీక్" అంటూ ట్వీట్ చేసింది. ఇదో తెలంగాణా స్టైల్ డ్యాన్స్ నంబర్ అని సమాచారం. దానికి తగ్గట్టే వెనక డ్యాన్సర్లు అందరూ బంజారా స్టైల్ ఎత్నిక్ వేర్ డ్రస్సుల్లో ఉన్నారు. ఇక నభా నటేష్ విషయానికి వస్తే సింపుల్ ఛోళి.. లెహెంగా.. దానికి తగ్గ ఆభరణాలు ధరించి మహా ఘాటు పోజులు ఇచ్చింది. ఇప్పటివరకూ నభా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసింది. ఈ సారి తన డ్యాన్స్ తో అందరినీ మెప్పించేలా ఉంది. పాటే దిమాక్ ఖరాబ్ కాబట్టి తన సెక్సీ స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అవుతారేమో.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సమ్మర్లోనే 'ఇస్మార్ట్ శంకర్' ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.