Begin typing your search above and press return to search.

వీడియో: ఇస్మార్ట్ గాళ్ ఆడిష‌న్స్‌ కేక‌

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:56 AM GMT
వీడియో: ఇస్మార్ట్ గాళ్ ఆడిష‌న్స్‌ కేక‌
X
కౌన్ రే పే తూ.. ఛాతి మీద చ‌ట‌క్ మాంసం లేదు. నువ్వు పెద్ద రౌడీవా?
ఎంతెంత పెద్ద ప‌హిల్వాన్ ని చూశాను తెలుసా? మావాన్ని ఇర‌గ్గొడ‌త‌వా? అంత పెద్ద మ‌గానివా రా..
రేయ్‌.. నీకంటే పెద్ద రౌడీన్రా నేను .. ముందు నాతో పోరాడు..
వ‌రంగ‌ల్ కాలేజ్ లోపోర‌గాళ్లు ఉచ్చ పోయించినా..
సిద్ధి పేట సెంట‌ర్ లో అడుగు.. చాందిని గురించి చెబుతారు
చిలికి .. చిటికేస్తే ధ‌ర్నాకి వ‌చ్చి అద‌రూ నిల‌బ‌డ‌తారు..
చాద‌ర్ పేట సిద్ది పేట గౌడిగూడ‌.. అంద‌రూ రాఖీ క‌ట్టించుకుపోతారు... ఏంటి అట్లా చూస్తున్నావ్!!

.. ఈ రేంజులో చెల‌రేగిపోయే ద‌మ్ము ఎవ‌రికి ఉంది? అంటే ఎలాంటి సందేహం లేకుండా ఇస్మార్ట్ గాళ్ నభా న‌టేష్ కే ఉంద‌ని చెప్పొచ్చు. ఇంత పెద్ద డైలాగ్ ని ఎంతో అల‌వోక‌గా చెప్పేయ‌డ‌మే కాదు.. ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేసిందంతే. ఇంత టెస్ట్ చేశాక కానీ పూరి ఇస్మార్ట్ గాళ్ ని ఎంపిక చేయ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

త‌న న‌మ్మ‌కాన్ని ఏమాత్రం వ‌మ్ము చేయ‌కుండా ప‌క్కా ఊర‌మాస్ డైలాగ్స్ ఘాటైన రొమాన్స్ తో ఇర‌గ‌దీసింది న‌భా. శంక‌ర్ లాంటి ప‌హిల్వాన్ తోనే పోటీప‌డి దులిపేసింది. అందుకే ఇప్పుడు న‌భా న‌టేష్ ఆడిష‌న్స్ వీడియో అంతే జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత న‌భా వెంట పెద్ద క్యూ ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి పేరు టాలీవుడ్ స‌హా అన్నిచోట్లా మార్మోగిపోతోంది.