Begin typing your search above and press return to search.

వీడియో: రాజమౌళి ఇది చూస్తే నవ్వి న‌వ్వి చచ్చిపోతాడు!

By:  Tupaki Desk   |   28 March 2023 9:59 AM
వీడియో: రాజమౌళి ఇది చూస్తే నవ్వి న‌వ్వి చచ్చిపోతాడు!
X
'నాటు నాటు' ఆస్కార్ విజయంపై ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డులలో RRR చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ టైటిల్ గెలుచుకోవ‌డంతో సోషల్ మీడియాల్లో ఇప్పటికీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సినిమాలోని హీరోయిక్ యాక్షన్ లకు.. నృత్యాల‌కు.. ఐకానిక్ కార్టూన్ సిరీస్ 'టామ్ అండ్ జెర్రీ'లో ఫ‌న్నీ నృత్య ప్రదర్శనకు మధ్య ఉన్న సారూప్యతను చూపించే ఎడిటెడ్ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఆశ్చర్యకరంగా.. 1940లలో క్రియేట్ చేసిన‌ టామ్ అండ్ జెర్రీ నుండి యానిమేటెడ్ కామెడీ క్లిప్ లకు ఈ సన్నివేశాలు సమాంతరంగా క‌నిపించాయి. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల భీక‌ర‌ పోరాట సన్నివేశాలు .. ఆ ఇద్ద‌రి న‌డుమా స్నేహానుబంధం .. కార్టూన్ పాత్రల కోసం చాలా సంవత్సరాల క్రితం ఇలాంటి సన్నివేశాలను రాసార‌ని ఈ వీడియోలో చెప్ప‌డం ఎంతో ఫ‌న్నీగా అనిపిస్తోంది. 'నాటు నాటు' పెప్పీ హుక్ స్టెప్స్ కూడా కార్టూన్ లో జెర్రీ- పసుపు బాతు అద్భుతంగా వేసాయి.

నిజానికి ఈ క్లిప్ 11 నెలల క్రితం మిస్టర్ ముఖేష్ జి అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ అయింది. ఆస్కార్ గెలుపు త‌ర్వాత తిరిగి ఇది ఆన్ లైన్ లో మ‌రింత‌గా వైర‌ల్ గా మారుతోంది. ఈ క్లిప్ కి యూట్యూబ్ లో 3.1 మిలియన్లకు పైగా వీక్షణలు ద‌క్కాయి. ఈ దృశ్యాల పోలికను చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఆన్ లైన్ లో నవ్వులు పూయించింది.

ఈ వీడియోపై నెటిజ‌నులు ర‌క‌ర‌కాల ఫ‌న్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ''కళ కళను అనుకరిస్తుంది. ఎవరు ఎవరిని కాపీ చేస్తున్నారు?'' అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా.. మరొక నెటిజ‌న్‌.. ఈ యుగం అన్ని బ్లాక్ బస్టర్ చలనచిత్రాలు టామ్ & జెర్రీ నుండి ప్రేరణ పొందాయని వ్యాఖ్యానించారు. రాజమౌళి ఇది చూస్తే నవ్వుతూ చచ్చిపోతాడు! అని మ‌రో నెటిజ‌న్ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప: ది రైజ్' ఉత్త‌రాదినా గొప్ప విజ‌యం సాధించింది. అల్లూ మార్క్ స్టెప్పులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్లో పూన‌కాలు సృష్టించాయి. నాటు నాటు త‌ర‌హాలోనే పుష్ప వీడియో క్లిప్స్ కి టామ్ అండ్ జెర్రీ యాక్ట్ తో జోడించి ఫ‌న్ ని క్రియేట్ చేసారు.

జెర్రీ పుష్ప డైలాగ్ ని డెలివరీ చేస్తున్నప్పుడు టామ్ రష్మిక మందన్న 'సామి సామి' స్టెప్ తో అల‌రించ‌డం ఈ క్లిప్ లో కనిపించింది. ఆ క్లిప్పింగ్ ని క్రియేట్ చేసిన‌ అదే యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడు నాటు నాటు ఫ‌న్నీ వీడియోని షేర్ చేసింది. నిజంగానే ఈ ఫ‌న్నీ వీడియోని చూశాక న‌వ్వి న‌వ్వి చ‌చ్చిపోవ‌డం గ్యారెంటీ. అయితే అయిన‌దానికి కాని దానికి కాపీ చేశాడంటూ ఆస్కార్ గెలుచుకున్న 'నాటు నాటు..'ను ప్ర‌స్థావించ‌డం స‌రికాదు. అలాగే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప‌నితనాన్ని అన‌వ‌స‌ర పోలిక‌ల‌తో విమ‌ర్శించ‌డం స‌రికాద‌నేది విశ్లేష‌కుల మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.