Begin typing your search above and press return to search.

RRR హుక్ స్టెప్.. నాటు నాటు కొరియోగ్ర‌ఫీ ఇలా

By:  Tupaki Desk   |   18 Nov 2021 4:03 AM GMT
RRR హుక్ స్టెప్.. నాటు నాటు కొరియోగ్ర‌ఫీ ఇలా
X
RRRలోని నాటు నాటు పాట వైరల్ గా మారింది. కోట్లాది మంది ఈ పాట‌ను వీక్షించారు. ముఖ్యంగా హుక్ స్టెప్ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తార‌క్ - రామ్ చ‌ర‌ణ్ త‌మ‌దైన స్టైల్ డ్యాన్సింగుల‌తో ది బెస్ట్ గా అల‌రించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసారు. పాట‌లో మ్యూజిక్ కంటే కొరియోగ్ర‌ఫీకి ఎక్కువ పేరొచ్చింది.

ఈ రోజు ప్రేమ్ ర‌క్షిత్ దీనిపై స్పందించారు. ప్రతి ఒక్కరికి స్టెప్ ఎలా చేయాలో నేర్పుతున్న వీడియోను పోస్ట్ చేయ‌డం ద్వారా ఆ పాట‌ను తెర‌కెక్కించేందుకు ఎంత‌గా డెడికేట్ అయ్యారో అర్థ‌మ‌వుతోంది. RRR పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మేకర్స్ కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఈ పాట హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఆర్.ఆర్.ఆర్ నుంచి టీజ‌ర్లు పోస్ట‌ర్లు పాట‌లు విడుద‌ల‌వుతుంటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పుడు ట్రైల‌ర్ కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. భారీ ఈవెంట్ లో ట్రైల‌ర్ ని ఆవిష్క‌రించే వీలుందని భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ల షెడ్యూల్ కి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి రిలీజ్ అంటే ఇంకో నెల‌న్న‌ర రోజులు మాత్ర‌మే ప్ర‌మోషన్స్ కి ఆస్కారం ఉంటుంది.