Begin typing your search above and press return to search.

హాలీవుడ్ క్రేజీ అవార్డ్స్ బ‌రిలో నాటు నాటు!

By:  Tupaki Desk   |   4 Nov 2022 1:30 PM GMT
హాలీవుడ్ క్రేజీ అవార్డ్స్ బ‌రిలో నాటు నాటు!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ యాక్ష‌న్ పాన్ ఇండియా వండ‌ర్‌ 'RRR'. స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చిలో విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌ని ఈ మూవీ ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ లుగా మార్చేసింది. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన త‌రువాత నుంచే ఈ మూవీ గురించి హాలీవుడ్ స్టార్స్ లో చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ సినిమాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం మొద‌లు పెట్టారు.

అంతే కాకుండా కొంత మంది హాలీవుడ్ రైట‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీని రిక‌మండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఫారిన్ ఆడియ‌న్స్ ఈ మూవీని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస్కార్ క‌మిటీ దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం కూడా చేశారు.

మ‌న దేశం నుంచి గుజ‌రాతీ సినిమా 'ఛ‌ల్లో'ని విదేశీ సినిమాల విభాగం త‌రుపున సెలెక్ట్ చేసినా 'RRR'ని కూడా వ‌చ్చే ఏడాది లాస్ ఏంజిల్స్ లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల‌కు వివిధ కేట‌గిరీల్లో నామినేష‌న్స్ కోసం పంపించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా వుంటే రీసెంట్ గా ఈ మూవీని జ‌పాన్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అక్క‌డి ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

మ‌న దేశంలోనే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ అత్యంత పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఎంతో మంది పారిన్ ప్రేక్ష‌కులు ఈ పాట‌కు క‌వ‌ర్ సాంగ్ చేసి మ‌రింత‌గా హోరెత్తించారు. తాజాగా హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో 'నాటు నాటు' సాంగ్ కి చోటు ద‌క్క‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ గా మారింది. ఈ ట్వీట్ ని 'RRR' అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా చిత్ర బృందం రీట్వీట్ చేస్తూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం విశేషం.

హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో పోటీప‌డుతున్న టాప్ ఫైవ్ సాంగ్స్ లో 'నాటు నాటు' సాంగ్ ఐద‌వ స్థానంలో పోటీప‌డుతోంది. ఈ అవార్డ్స్ ని న‌వంబ‌ర్ 16న ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ రేసులో 'నాటు నాటు' సాంగ్ అవార్డుని ద‌క్కించుకోగ‌లిగితే ఆస్కార్ బ‌రికి 'RRR'కు గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.