Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ చేతుల మీదుగా విడుదలైన అల్లరోడి 'నాంది' ట్రైలర్..!
By: Tupaki Desk | 6 Feb 2021 10:15 AM ISTసిల్వర్ స్క్రీన్ పై తనదైన అల్లరితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు తన పంథా మార్చుకొని ''నాంది'' అనే ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది' ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'నాంది' ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే.. రాజగోపాల్ అనే వ్యక్తి హత్య నేపథ్యంలో హీరో అన్యాయంగా అరెస్ట్ కాబడి ఐదు సంవత్సరాలు జైలులో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నట్లు తెలుస్తోంది. జైలులో నరేష్ ని నగ్నంగా వేలాడదీసి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అల్లరి నరేష్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను షాక్ కి గురి చేయబోతున్నాడని అర్థం అవుతోంది. ఇందులో అబ్బూరి రవి అందించిన 'ఇక్కడ చట్టాలు చేతకాని వాడి మీద వాడటానికే.. అధికారంలో ఉన్నవాడిని ఏమి చేయలేవు' 'ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం మాత్రమే కాదు.. న్యాయం చేయడం కూడా' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
వినూత్నమైన కథ కథనాలతో న్యాయవ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపేలా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. దీనికి సిద్ జే సినిమాటోగ్రఫీ మరియు శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ తరపున వాదించే లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపిస్తుండగా.. పోలీస్ పాత్రలో హరిశ్ ఉత్తమన్ నటించాడు. అల్లరి నరేష్ తండ్రిగా దర్శకుడు దేవీ ప్రసాద్ కనిపించాడు. నవమి హీరోయిన్ గా నటించగా ప్రియదర్శి - ప్రవీణ్ - వినయ్ వర్మ - నర్సింహారావు - శ్రీకాంత్ అయ్యంగార్ - రమేష్ రెడ్డి - చక్రపాణి - మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.