Begin typing your search above and press return to search.
అల్లరి 'నాంది'ని దక్కించుకునేందుకు బిగ్ ఆఫర్
By: Tupaki Desk | 14 Dec 2020 10:41 AM ISTఅల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన సీరియస్ మూవీ 'నాంది'. ఇప్పటి వరకు కామెడీ పాత్రలు చేసిన అల్లరి నరేష్ ఈ సినిమాలో పూర్తి స్థాయి సీరియస్ నోడ్ పాత్రను చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఏకంగా న్యూడ్ గా కూడా కనిపించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యి చాలా నెలలు అవుతుంది. కాని థియేటర్లు ఓపెన్ లేక పోవడం వల్ల సినిమాను విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు పలు ఓటీటీలు ఆఫర్ చేస్తూనే ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారట.
థియేటర్లు ఓపెన్ అయినా కూడా నాంది వంటి చిన్న సినిమాకు అది కూడా ప్లాప్ ల్లో ఉన్న అల్లరి నరేష్ సినిమాకు జనాలు వచ్చేది నమ్మకం తక్కువగా ఉంది. అందుకే ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. యూనిట్ సభ్యులు కొందరు మాత్రం ఇంకా అమెజాన్ ద్వారా విడుదలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అమెజాన్ భారీ మొత్తంను ఆఫర్ చేయడంతో ఓటీటీ రిలీజ్ కు నాంది మేకర్స్ ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.