Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ప్రమోషన్లు అచ్చొస్తాయా?

By:  Tupaki Desk   |   22 May 2018 12:44 PM GMT
ఐపీఎల్ ప్రమోషన్లు అచ్చొస్తాయా?
X
పటాస్ సినిమాతో కెరీర్ కు ఊపొచ్చింది అనుకున్న కళ్యాణ్ రామ్ మళ్లీ గతంలో లాగానే ఫెయిల్యూర్స్ బాట పట్టాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా విజయాలు దక్కడం లేదు. చివరగా చేసిన ఎమ్మెల్యే సినిమా ఎంతో కొంత విజయం సాదిస్తుందని అనుకున్నప్పటికీ అది కూడా నిరాశే మిగిల్చింది. అయితే ఈ సారి ఎలాగైనా ఒక హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతుండడంతో దాని ద్వారా సినిమాకు హైప్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ప్లే ఆఫ్ కు చేరుకున్న ఐపీఎల్ ఎంతో ఉత్కంఠగా మారింది. దీంతో తెలుగు లో 'మా మూవీస్' లో సినిమా ప్రమోషన్స్ చేయాలనీ నా నువ్వే టీమ్ రెడీ అయ్యింది. అంతే కాకుండా సన్ రైజర్స్ మ్యాచుకు కూడా వెళ్ళాళని చూస్తున్నారు. తన హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటి తమన్నాతో కలసి.. అక్కడ మెరిస్తే.. ఆ ప్రమోషన్ రేంజ్ అదిరిపోతుందని కల్యాణ్‌ రామ్‌ ఫీలింగట. అయితే ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ అన్నట్లు రూపొందించారు కాబట్టి.. ఇలాంటి ప్రమోషన్ల వర్కవుట్ అవుతాయనేది వీరి ఫీలింగ్.

జయేంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మొదటి సారి కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్లామర్ టచ్ సినిమాలో స్ట్రాంగ్ గా ఉందని ఓ టాక్ అయితే వచ్చింది. సినిమా కూడా ఆకట్టుకోగలిగితే తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. జూన్ 1న నా నువ్వే సినిమా రిలీజ్ కానుంది. మరి రెగ్యులర్ గా కాకుండా కాస్త క్రికెట్ సైడ్ నుంచి చేస్తున్న ప్రమోషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.