Begin typing your search above and press return to search.

'నాకోసం' టీజర్: చిన బంగార్రాజు - నాగలక్ష్మీల ప్రేమగీతం..!

By:  Tupaki Desk   |   2 Dec 2021 5:46 AM GMT
నాకోసం టీజర్: చిన బంగార్రాజు - నాగలక్ష్మీల ప్రేమగీతం..!
X
కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది దీనికి ఉపశీర్షిక. ఇది సూపర్ హిట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి సీక్వెల్. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 'బంగార్రాజు' చిత్రం నుంచి విడుదలైన ‘లడ్డుండా’ పాట విశేష స్పందన తెచ్చుకుంది. అలానే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ లో చిన బంగార్రాజు గా చైతూ ఆకట్టుకున్నాడు.

తాజాగా బంగార్రాజు చిత్రం నుంచి 'నాకోసం' అనే సెకండ్ సింగిల్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'నాకోసం మారావా నువ్వూ.. లేక నన్నే మార్చేసావా నువ్వూ..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చై-కృతి జోడీ ఆకట్టుకుంటోంది. సినిమాలో చిన బంగార్రాజు - నాగలక్ష్మి ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు అర్థం అవుతోంది.

'నాకోసం' పాటను యువ గాయకుడు సిద్ శ్రీరామ్ - మంగిలి కలిసి ఆలపించారు. అనూప్ రూబెన్స్ ఈ మెలోడీకి స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత బాలాజీ సాహిత్యం అందించారు. పూర్తి లిరికల్ వీడియోని డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 05.12 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

కాగా, 'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. సత్యానంద్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.