Begin typing your search above and press return to search.

'నా కనులు ఎపుడు' సాంగ్: దేవిశ్రీ మ్యూజిక్ లో సిద్ శ్రీరామ్ మ్యాజిక్..!

By:  Tupaki Desk   |   2 March 2021 1:19 PM GMT
నా కనులు ఎపుడు సాంగ్: దేవిశ్రీ మ్యూజిక్ లో సిద్ శ్రీరామ్ మ్యాజిక్..!
X
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''రంగ్ దే''. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. మార్చి 26న 'రంగ్ దే' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన 'ఏమిటో ఇది' 'బస్టాండే బస్టాండే' పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్ లో యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించిన ''నా కనులు ఎపుడు'' అనే గీతాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా సాంగ్ ప్రోమో వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ''నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని.. హృదయమెపుడు విననే విననీ.. మాయలో తేలుతున్నా..'' అంటూ సిద్ శ్రీరామ్ తనదైన వాయిస్ తో మ్యాజిక్ చేసాడు. దీనికి దేవిశ్రీ అంతే అద్భుతమైన ట్యూన్ అందించాడు. దేవి - సిద్ కలయికలో వస్తున్న ఈ మొదటి పాట ప్రోమో శ్రోతలని విశేషంగా అలరిస్తోంది. మరో చార్ట్ బ్లస్టర్ సాంగ్ రెడీ అయినట్లు ఈ ప్రోమోతోనే అర్థం అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మార్చి 4న సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ మనోహరమైన పాట లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.