Begin typing your search above and press return to search.

ఆ రూమ‌ర్ల‌కు ప‌వ‌న్ తోనే చెక్ పెట్టించిన మైత్రీ!

By:  Tupaki Desk   |   10 Jun 2022 5:37 AM GMT
ఆ రూమ‌ర్ల‌కు ప‌వ‌న్ తోనే చెక్ పెట్టించిన మైత్రీ!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో 'భవదీయుడు భగత్ సింగ్' ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. గ‌తంలో ప‌వ‌న్‌-హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన 'గ‌బ్బ‌ర్ సింగ్' బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే వీరి తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించి చాలా నెల‌లు అవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వ‌స్తుందా అని అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు.

అప్పుడు, ఇప్పుడు అంటున్నారే త‌ప్ప ఈ మూవీ ప‌ట్టాలెక్క‌డం లేదు. మ‌రోవైపు ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న 'హరి హర వీరమల్లు'తో బిజీగా గ‌డుపుతున్నాడు.

దాంతో 'భవదీయుడు భగత్ సింగ్' ఈ ఏడాది కూడా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు లేవ‌ని ఓవైపు ప్ర‌చారం జ‌రుగుతుంటే.. మ‌రోవైపు ఈ సినిమా ఏకంగా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఏది నిజ‌మో తెలియ‌క అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే మైత్రీ వారు ఆ రూమ‌ర్ల‌కు ప‌వ‌న్ తోనే చెక్ పెట్టించారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న్యాచుర‌ల్ స్టార్ నాని కోసం 'అంటే.. సుంద‌రానికీ!' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెష‌ల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. 'నాని నటుడిగానే కాకుండా, తన వ్యక్తిత్వం కూడా నాకు ఎంతో ఇష్టం. నాని బలంగా నిలబడగల వ్యక్తి. ఆయన భారీ విజయాలు సాధించాలని మ‌న‌సారా కోరుకుంటున్నాను.

డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన అందరికీ అభినందనలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని పేర్కొన్న ఆయ‌న చిర‌వ‌రిగా 'నేను త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్‌లో నటించబోతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి స్వయంగా పవన్ తమ సినిమా ఆగలేదని ప‌రోక్షంగా చెప్ప‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.