Begin typing your search above and press return to search.
పూరీ - సల్మాన్ లతో మైత్రీ ప్లాన్స్..?
By: Tupaki Desk | 8 Oct 2021 9:00 AM ISTప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పలు క్రేజీ కాంబినేషన్స్.. ఊహకందని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న మైత్రీ.. ఓ వైపు మీడియం బడ్జెట్ మూవీస్.. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు సల్మాన్ కు మైత్రీ టీమ్ పది కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించారని.. అందుకుగాను 2023 లో డేట్స్ ఇచ్చాడని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం సరైన దర్శకుడి కోసం వెతుకులాట ప్రారంభించిన ప్రొడ్యూసర్స్.. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని లాక్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని సంప్రదించిన మేకర్స్.. చివరకు పూరీ ని పట్టుకోగలిగారని అంటున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'బుడ్డా హోగా తేరే బాప్' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు పూరి జగన్నాథ్. అప్పట్లో సల్మాన్ తో ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. ఇంతవరకు నిజం కాలేదు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ''లైగర్'' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో పూరీ ఓ మూవీ ప్లాన్ చెయ్యబోతున్నాడని టాక్ వచ్చింది. ఇప్పుడు సల్మాన్ తో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఒప్పించారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా పూరి తన స్టైల్లో స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. మరి బాలయ్య సినిమా తరువాత పూరీ చేయబోయే సినిమా ఇదే అవుతుందేమో చూడాలి. ఇకపోతే మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పోకిరి' చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో 'వాంటెడ్' పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.