Begin typing your search above and press return to search.

మహేష్ ఆ నిర్మాతలతోనే ?

By:  Tupaki Desk   |   12 March 2020 10:00 AM IST
మహేష్ ఆ నిర్మాతలతోనే ?
X
కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుంటున్నాడు మహేష్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమా డిసైడ్ అయ్యే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' రిలీజై మూడు నెలలు అవుతున్న ఇంత వరకూ నెక్స్ట్ ఎవరితో అనేది కన్ఫర్మ్ చేయకుండా అభిమానులని వెయిటింగ్ మోడ్ లో ఉంచాడు.

మెగా స్టార్ చిరు సినిమాలో ఓ క్యారెక్టర్ ప్లే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ హీరోగా తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోకోలేకపోతున్నాడు. వంశీ చెప్పిన కథలో కొన్ని మార్పులు చెప్పిన మహేష్ మరో వైపు పరశురాం కి ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేయమని అందుకోసం ఇంకా నెల టైం తీసుకోమని చెప్పాడని అంటున్నారు.

వంశీతో కూడా సినిమా ఉంటుందనేది పక్కాగా వినిపిస్తుంది. కానీ పరశురాం తర్వాతే ఆ సినిమా ఉంటుందనేది టాక్. అయితే పరశురాం తో చేయబోయే సినిమా మైత్రి మూవీ మేకర్స్ లోనే చేస్తాడట మహేష్. ఈ మేరకూ సూపర్ స్టార్ కి ఓ బారీ ఆఫర్ ఇచ్చారట మైత్రి నిర్మాతలు. శ్రీ మంతుడు తర్వాత మరో సినిమా చేస్తానని అప్పట్లో కమిట్ అయ్యాడు మహేష్. ఇప్పుడా మాట నిలబెట్టుకొని 28వ సినిమాను అదే బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతున్నాడు.