Begin typing your search above and press return to search.

మైత్రి వాళ్ల లిస్ట్ గట్టగానే ఉందే

By:  Tupaki Desk   |   7 May 2018 11:30 PM GMT
మైత్రి వాళ్ల లిస్ట్ గట్టగానే ఉందే
X
శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ జనతా గ్యారేజ్ - రంగస్థలం వంటి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టేసింది. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ఇండస్ట్రీలో లో టాప్ ప్రొడక్షన్స్ బ్యానర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అవుతున్నారు ఈ బ్యానర్ నిర్మాతలు నవీన్ - రవి శంకర్ అండ్ సివి మోహన్.

ఇక నెక్స్ట్ కూడా ఈ టీమ్ భారీ ప్రాజెక్ట్ లతో సిద్ధమవ్వనుంది. ప్రస్తుతం కొన్ని మీడియం చిత్రాలు చేతిలో ఉన్నాయి. నాగ చైతన్య - సవ్యాసాచి తో పాటు రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాను కూడా ఈ బ్యానర్ లోనే రానుంది. ఈ సినిమాల తరువాత.. ముందే బడా కాంబినేషన్ ని సెట్ చేసుకున్నారు. హీరోలతో కూడా మాట్లాడేశారు. సుకుమార్ - మహేష్ కాంబినేషన్ తో పాటు ఎన్టీఆర్ - కొరటాల శివ - రామ్ చరణ్ వంటి వారు మైత్రి మూవీ మేకర్స్ లిస్ట్ లో ఉన్నారు.

ముందే వీరందరితో అగ్రిమెంట్స్ కూడా చేయించుకున్నారు. ఇప్పుడున్న చోట ప్రాజెక్ట్స్ అయిపోగానే బడా సినిమాలు మొదలు కానున్నాయి. అందులో భాగంగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ 26వ చిత్రం స్టార్ట్ కానుంది. మరి ఆ ప్రాజెక్టులతో మైత్రి ఎంత వరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.