Begin typing your search above and press return to search.

ధమాకా డైరెక్టర్ పై మైత్రి వారి కన్ను..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 3:00 PM IST
ధమాకా డైరెక్టర్ పై మైత్రి వారి కన్ను..!
X
సినిమా సినిమాకు జాతకాలు మారే రంగుల ప్రపంచం అది. అక్కడ హిట్టు కొడితే లెక్క వేరేలా ఉంటుంది. అదే ఫ్లాప్ పడితే పొగిడిన నోళ్ళే రివర్స్ అవుతాయి. అందుకే అక్కడ వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకున్న వారే ఎప్పుడూ సక్సెస్ ట్రాక్ లో ఉంటారు. ఇక్కడ సక్సెస్ ఉన్న వారికే వెయిట్ ఎక్కువ కాబట్టి ఆ సక్సెస్ కోసమే అందరు ప్రాకులాడుతారు.

డైరెక్టర్ గా కెరీర్ ఎక్కడ మొదలు పెట్టాం అన్నది కాదు సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నామా అన్నది కాలిక్యులేట్ అవుతుంది. అలాంటి ఒక డైరెక్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. అతనెవరో కాదు ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు.

వరుణ్ సందేశ్ తో ప్రియతమా నీవచట కుశలమా సినిమాతో దర్శకుడిగా 2013లోనే తొలి సినిమా తీసిన త్రినాథ రావు ఆ సినిమాతో పెద్దగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా ఆ తర్వాత తనీష్ తో తీసిన మేం వయసుకు వచ్చాం సినిమా మాత్రం యూత్ ఆడియన్స్ ని అలరించింది.

డైరెక్టర్ గా త్రినాథ రావుకి మంచి మార్కులు పడేలా చేసిన సినిమా అదే. ఆ తర్వాత మళ్లీ వరుణ్ సందేశ్ తోనే నువ్వలా నేనిలా సినిమా తీయగా అది నిరాశపరచింది. రాజ్ తరుణ్ తో చేసిన సినిమా చూపిస్త మావ సూపర్ హిట్ అవడంతో మళ్లీ త్రినాథ రావు ఫాం లోకి వచ్చాడు.

ఆ సినిమా తర్వాత నాని నేను లోకల్ కూడా సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో త్రినాథ రావు కి ఒక మార్క్ పడ్డది. రాం తో హలో గురు ప్రేమ కోసమే సినిమా తీశాడు. అది కూడా పర్వాలేదు అనిపించుకోగా లేటెస్ట్ గా రవితేజతో ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మొదటి షో యావరేజ్ టాక్ తో మొదలై 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ధమాకా. రైటర్ ప్రసన్న కుమార్ నక్కిన త్రినాథ రావుకి బాగా సింక్ కుదిరింది అందుకే ఇద్దరు కలిసి సూపర్ హిట్లు ఇస్తున్నారు.

ధమాకా హిట్ తో టాప్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఆఫర్ అందుకున్నాడట నక్కిన త్రినాథ రావు. సినిమా చూసేందుకు వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే తన ముఖ్య ఉద్దేశం పెట్టుకున్న త్రినాథ రావు తన సినిమా అంటే ఆడియన్స్ నమ్మకంతో వచ్చేలా చేసుకున్నాడు. మైత్రి మేకర్స్ తో త్రినాథ రావు సినిమా అంటే ఈసారి టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నాడని చెప్పొచ్చు. మరి ఈసారి త్రినాథ రావుతో చేసే హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.