Begin typing your search above and press return to search.

మైత్రి వారి జోరు.. చిరు బాలయ్య మొదలు అఖిల్ వరకు

By:  Tupaki Desk   |   13 Jun 2021 10:30 AM GMT
మైత్రి వారి జోరు.. చిరు బాలయ్య మొదలు అఖిల్ వరకు
X
ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారు చేస్తున్న సినిమాల సంఖ్య సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్ కు చేరింది. మెగా స్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినిమాలు మొదలుకుని యంగ్ హీరోలు పలువురితో స్టార్ హీరోలతో కూడా మైత్రి వారు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ్ స్టార్ హీరో మరియు బాలీవుడ్ హీరో తో కూడా సినిమాను చేసేందుకు వీరు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మరో సినిమాను కూడా మైత్రి వారు మొదలు పెట్టేందుకు సిద్ధం అయినట్లుగా సమాచారం అందుతోంది.

అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా సినిమాను అఖిల్ చేస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమాను నిర్మించబోతున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయట.

అఖిల్ తో లవ్ యాక్షన్ సినిమాను మైత్రి వారు తెరకిక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ తో మైత్రి వారు నిర్మించబోతున్న సినిమా కు దర్శకత్వం చేసేది ఎవరు అనే విషయం పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైత్రి వారు ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్నారు. కనుక అఖిల్ తో కూడా మైత్రి వారు సక్సెస్ దక్కించుకుంటారేమో చూడాలి.