Begin typing your search above and press return to search.

సవ్యసాచి గురి బాగా కుదిరిందట

By:  Tupaki Desk   |   28 March 2018 10:58 AM GMT
సవ్యసాచి గురి బాగా కుదిరిందట
X
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఓ భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ అక్కినేని హీరో కెరీర్ లో డిజాస్టర్స్ నుంచి సూపర్ హిట్స్ వరకూ అన్నీ ఉన్నాయి. కానీ కెరీర్ ను పరుగులు పెట్టించే బ్లాక్ బస్టర్ ఒక్కటే పడలేదు.

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ సవ్యసాచి కి బడ్జెట్ బాగా అయిందని అంటున్నారు. దాదాపు 26 కోట్ల వరకూ ఈ సినిమాకు ఇన్వెస్ట్ మెంట్ అయిందట. చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ అంటే.. గతేడాది వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం. అది 25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఖర్చుల రూపంలోనే 26 కోట్లు అంటే.. ప్రమోషన్స్ ఇతర పనులు అన్నీ పూర్తయేసరికి 30 కోట్లను దాటిపోతుంది. అయినా సరే ఈ చిత్రంపై మాంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారట నిర్మాత.

మూవీ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే.. సినిమా బాగా వస్తోందని.. తాము బ్లాక్ బస్టర్ తీయబోతున్నామని నమ్మకం కలిగిందట. అందుకే 25 కోట్లు పెట్టాలన్నా కూడా నిర్మాత వెనకాడట్లేదు అని తెలుస్తోంది. చందు మొండేటి మూవీని సూపర్బ్ గా పిక్చరైజ్ చేయడంతోనే బడ్జెట్ విషయంలో లిమిట్స్ పెట్టలేదు అంటున్నారు. సవ్యసాచి అంటూ చైతు- చందూ మొండేటి కలిసి గట్టిగానే గురి చూసి కొట్టబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.