Begin typing your search above and press return to search.

బ్యానర్ బరువంతా నాని మీదే

By:  Tupaki Desk   |   5 Aug 2019 8:36 AM GMT
బ్యానర్ బరువంతా నాని మీదే
X
సినిమా పరిశ్రమ తీరే అంత. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు అంతరిక్ష విమానాలు అవుతాయి. ఇక్కడ ఎన్ని కోట్లు అయినా పెట్టుబడి పెట్టవచ్చు ఎందరు స్టార్స్ ను కావాలన్నా ఒకే ప్రాజెక్ట్ లోకి తీసుకురావచ్చు. కానీ సక్సెస్ ని మాత్రం ఆ బ్రహ్మ దేవుడు కూడా ముందే చెప్పలేడు. అందుకే చాలా అగ్ర నిర్మాణ సంస్థలు ప్రొడక్షన్ ని మెల్లగా తగ్గించుకుంటూ భాగస్వామ్య పద్ధతిలో సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంటే సోలో నిర్మాణం ఉండేది. ఇప్పుడు ఎవరితోనో టై అప్ లేనిదే వెంకటేష్ తో కూడా సినిమాలు చేయడం లేదు.

బిజినెస్ పోకడ మారిన తరుణంలో ఇలాంటీ రాజీలు తప్పవు. కానీ కేవలం నాలుగేళ్ల కాలంలో బుడిబుడి అడుగులు వేసిన ఓ సంస్థ వరుసగా ముగ్గురు స్టార్ హీరోలతో మూడు బ్లాక్ బస్టర్లు నిర్మించడం ఎవరైనా ఊహించగలమా. మైత్రి అది సాధ్యం చేసి చూపించింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా తాజా పరిణామాలు ఇబ్బంది పెడుతున్నాయి. గత ఏడాది సెకండ్ హాఫ్ లో సవ్యసాచి - అమర్ అక్బర్ ఆంటోనీ మైత్రి బ్రాండ్ కు బాగా డ్యామేజ్ చేశాయి. కాంబినేషన్లు చూసుకోవడం తప్ప కథలు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ జోరుగానే వినిపించాయి.

సరే ఆ రెండు పోతే పోయాయి అనుకుని విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కు భారీగా ఖర్చు పెడితే అది కాస్తా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని పూర్తి చేయడానికి పనికి వచ్చింది. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు పార్ట్ నర్ లో ఒకరు బయటికి రావడం పద్మవ్యూహంలోకి నెట్టేసింది. మరోపక్క వైష్ణవ్ తేజ్ తో మొదలుపెట్టిన ఉప్పెన షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. వచ్చే నెల నాని గ్యాంగ్ లీడర్ వస్తుంది. ఇప్పుడిది బ్లాక్ బస్టర్ అయితే మైత్రికి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదు సరికదా డ్యామేజ్ పెరుగుతుంది. అందుకే కొంత బూస్ట్ లాంటి ఎనర్జీ కావాలంటే మైత్రికి గ్యాంగ్ లీడర్ హిట్ కావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చూడాలి నాని ఈ భారం ఎంతవరకు మోస్తాడో