Begin typing your search above and press return to search.

అమర్ అక్బర్ ను మైత్రీ వారు అలా చేస్తున్నారట!

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:34 PM IST
అమర్ అక్బర్ ను మైత్రీ వారు అలా చేస్తున్నారట!
X
వరుసగా మూడు బ్లాక్ బస్టర్లతో అందరి చూపుని తమవైపు తిప్పుకున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారికి ఈమధ్యనే రిలీజ్ అయిన 'సవ్యసాచి' ఫలితం పెద్ద షాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈ సినిమాను కొన్నవారందరికి నష్టాలు తప్పలేదు. దీంతో మైత్రీ వారు బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్ల కోసం ఒక ఆలోచనతో ముందుకు వచ్చారట.

త్వరలో మైత్రీ సంస్థ నిర్మించిన మరో సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ' విడుదల అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 'సవ్యసాచి' బయ్యర్లకు నామమాత్రపు ధరలకే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. కొన్ని ఏరియాల్లో అసలు అడ్వాన్సు తీసుకోకుండా రైట్స్ ఇచ్చారని కూడా అంటున్నారు. దీంతో 'సవ్యసాచి' వల్ల డబ్బు నష్టపోయిన వారికి ఉపశమనం కలిగించినట్టుగా ఉంటుందని భావిస్తున్నారట. మైత్రీ వారికి శాటిలైట్.. డిజిటల్.. హిందీ రైట్స్ ద్వారా ఈ సినిమాకు బాగానే ముట్టిందట. 'సవ్యసాచి' బయ్యర్లను ఆదుకోవడానికి ముందుకు రావడానికి అదీ ఒక కారణమట.

ఇదిలా ఉంటే కొంతమంది ట్రేడ్ విశ్లేషకుల వెర్షన్ వేరేలా ఉంది. 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాకు హైప్ లేదని శ్రీను వైట్ల సినిమామీద ఇన్వెస్ట్ చేసేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతోనే 'సవ్యసాచి' బయ్యర్ల చేతిలో పెడుతున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా మైత్రీవారు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి ఎక్కుతారో లేదో వేచి చూడాలి.