Begin typing your search above and press return to search.

న్యూ మెగా హీరో డెబ్యూకి మైత్రి - సుక్కు

By:  Tupaki Desk   |   27 Oct 2018 4:33 AM GMT
న్యూ మెగా హీరో డెబ్యూకి మైత్రి - సుక్కు
X
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ డెబ్యూ గురించి చాలారోజుల క్రితమే వార్తలు వచ్చాయి గానీ ఎందుకో ఆ విషయం ముందుకు కదల లేదు. వైష్ణవ్ కంటే ముందుగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైష్ణవ్ మొదటి సినిమా ఫైనలైజ్ అయిందట.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు సుకుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు సానా దర్శకుడిగా మారుతున్నాడు. బుచ్చిబాబు గతంలో 'రంగస్థలం' సినిమాకు రచనా సహకారం అందించాడు. వైష్ణవ్ డెబ్యూ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ బ్యానర్ - సుకుమార్ మ్యజికల్ టచ్ - దేవీ మ్యూజిక్.. ఇంతకంటే బెస్ట్ లాంచ్ ప్యాడ్ ఏ హీరో కైనా దొరుకుతుందా చెప్పండి?

త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసేందుకు మైత్రీవారు రెడీ అవుతున్నారట. మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వస్తున్నాడంటే అందరి దృష్టి ఆ హీరోపైనే ఉంటుంది. లుక్స్ వైజ్ వైష్ణవ్ తేజ్ కు మంచి మార్కులు వెయ్యొచ్చు. తన నటనతో.. మెగా ట్రేడ్ మార్క్ అయిన డ్యాన్సులు ఫైట్లతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.